AP Highcourt: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు.. వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ తిరస్కరణ
ABN , Publish Date - Sep 04 , 2024 | 12:02 PM
Andhrapradesh: టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసుల్లో వైసీపీ నేతలక బిగ్ షాక్ తగిలింది. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలకు నిరాశే ఎదురైంది. వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణకు రాగా.. బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం తిరస్కరించింది.
అమరావతి, సెప్టెంబర్ 4: టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసుల్లో వైసీపీ (YSRCP) నేతలకు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును (AP High Court) ఆశ్రయించిన వైసీపీ నేతలకు నిరాశే ఎదురైంది. వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణకు రాగా.. బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం తిరస్కరించింది.
North Korea: నియంతృత్వానికి పరాకాష్ట.. వరదలను అడ్డుకోలేదని 30 మందికి ఉరి
హైకోర్ట్ ఉత్తర్వులను రెండు వారాల పాటు సస్పెండ్ చేసి తమకు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని వైసీపీ నేతల తరపు న్యాయవాదులు కోరారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఉందని వైసీపీ నేతల తరపు న్యాయవాదులు చెప్పారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు అలా లేదని కోర్టుకు టీడీపీ న్యాయవాదులు తీర్పు కాపీ ఇచ్చారు. అన్నింటినీ పరిశీలించిన హైకోర్టు తుది ఉత్తర్వులు ఈరోజు మధ్యాహ్నం ఇస్తామని పేర్కొంది.
కాగా.. 2021 అక్టోబరు 19న జరిగిన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డ విషయం తెలిసిందే. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పోలీసులు తూతూమంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ కేసుపై దృష్టి సారించారు. ఈ ఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులు క్రైం నెంబర్ 650/2021గా కేసు నమోదు చేశారు. ఐపీసీ 307 సెక్షన్‌తో పాటు మరికొన్ని సెక్షన్లను జోడించారు.
Medaram: నేలకొరిగిన భారీ వృక్షాలు
ఐపీసీ 147,148, 452, 427, 323, 324, 506, 326, 307, 450, 380, రెడ్‌విత్ 109, 120బి, 149 తదితర సెక్షన్లతో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఇప్పటివరకు మొత్తం 106 మందికి టీడీపీ కార్యాలయంపై దాడిలో ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. 21 మందిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. మిగతా 85 మందికి మంగళగిరి రూరల్ పోలీసులు ఈ నెల 19 నుంచి నోటీసులు జారీ చేశారు. వీరిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితోపాటు, విజయవాడకు చెందిన వైసీపీ నేత దేవినేని అవినాష్, అరవ సత్యం వంటి ముఖ్య నేతలతోపాటు ఓ న్యూస్ చానల్ రిపోర్టర్ కూడా ఉన్నాడు. అందుబాటులో లేని వారి ఇళ్లకు నోటీసులు అతికిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
Rain Alert: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచ
Vijayawada: కాలనీలకు అందని సాయం.. వరద నీటిలోనే బాధితులు
Read Latest AP News And Telugu News