Home Minister Anitha: వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు..
ABN , Publish Date - Dec 09 , 2024 | 01:27 PM
తప్పులు బయటపడుతున్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి తన స్థాయి.. వయసును మరిచిపోయి నోటికొచ్చినట్లు చిల్లరగా మాట్లాడుతున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని.. ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని అన్నారు.
విజయవాడ: హోంమంత్రి (Home Minister) వంగలపూడి అనిత (Vangalapudi Anitha) సోమవారం విజయవాడ (Vijayawada)లోని సబ్‌జైల్‌ను పరిశీలించారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి రావడం జరిగిందని, మౌలిక వసతులపై ఆరా తీశామని, జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేయడం జరిగిందని ఆమె అన్నారు. జైలుఅధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందని, రెండు రోజుల్లో నివేదిక వస్తుందని త్వరలో చర్యలు తీసుకుంటానమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తప్పులు బయటపడుతున్నాయని వైఎస్సార్‌సీపీ (YSRCP) ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి తన స్థాయి.. వయసును మరిచిపోయి నోటికొచ్చినట్లు చిల్లరగా మాట్లాడుతున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని.. ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని అన్నారు. విజయసాయి ఎన్ని రకాలుగా సీఎం చంద్రబాబును తిట్టినా.. బురద జల్లినా.. పవన్ కల్యాణ్‌కు.. తమకు మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నించినా.. ఏం చేసినా.. ‘నిన్ను మాత్రం వదిలిపెట్టేదిలేదని’ హోంమంత్రి హెచ్చరించారు.
విజయసాయి రెడ్డి ఎంతమంది వద్దకు వెళ్లి ఎన్ని రకాలుగా మాట్లాడినా, తన గురించి విమర్శలు చేసినా ఏం భయపడేదిలేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, ప్రజల సొమ్ము తిన్నారని, ఆస్తులు కొల్లగొట్టారని.. ఈ అంశాలపై విచారణ జరుగుతోందని అన్నారు. ఏ తప్పు చేయకపోతే విజయసాయి రెడ్డికి భయమెందుకు.. ధైర్యంగా ముందుకొచ్చి విచారణ చేసుకోమని చెప్పాలన్నారు. అవన్నీ వదిలేసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని అనిత మండిపడ్డారు. తాము చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని.. అవన్నీ వదిలేసి టాపిక్‌ను డైవర్టు చేసే విధంగా మీడియా ముందు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఇదే విధంగా వైఎస్సార్‌సీపీ నేతలు వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఈ 11 సీట్లు కూడా రావని హోమంత్రి అనిత జోష్యం చెప్పారు. రేషన్ బియ్యం అక్రమాలపై విచారణ జరుగుతోందని.. నిందుతులను వదిలిపెట్టేదిలేదని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బోరుగడ్డ అనిల్‌కు పోలీస్ స్టేషన్‌లో రాచమర్యాదలపై ఓ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకున్నామని హోంమంత్రి తెలిపారు.
విజయసాయి రెడ్డిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తామని, కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టేవిధంగా వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. ఆరోపణలపై సమాధానం చెప్పాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిదికాదన్నారు. అధికారులను బెదిరించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. పార్టీలకు పోలీసులు తొత్తులుగా మారితే చర్యలు తప్పవని, పోలీసులు ప్రజలకు సేవలు అందించాలని.. పోలీసులు ఎక్కడైనా ఏకపక్షంగా వ్యవహరించారని తేలితే వారిపై చర్యలు తప్పవని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్‌కు రూ. 3100 కోట్ల ముడుపులు..
కుక్కల విద్యాసాగర్‌కు షరతులతో కూడిన బెయిల్
ABN Live: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
డిసెంబర్ 9కి తెలంగాణలో చాలా ప్రత్యేకతలు.. ఏంటంటే..
నందికొట్కూరు బైరెడ్డినగర్‌లో దారుణం
తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకున్న రాజకీయం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News