Share News

Supreme Court: చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మరి కాసేపట్లో తీర్పు

ABN , Publish Date - Jan 16 , 2024 | 10:04 AM

న్యూఢిల్లీ: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Supreme Court: చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మరి కాసేపట్లో తీర్పు

న్యూఢిల్లీ: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సుప్రీంకోర్టు మరికాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బాబుపై 17 ఏపై దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ రోజు తీర్పు ఇవ్వనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. అయితే న్యాయమూర్తులు విడివిడిగా జడ్జిమెంట్ ఇవ్వనున్నారు.

కాగా అక్టోబర్ 20న తుది విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు పిటీషన్ వేశారు. 17 ఏ ప్రకారం రాష్ట్ర గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఇరువైపు వాదనలు ముగియడంతో సుప్రీం కోర్టు తీర్పు ఈ రోజుకు వాయిదా వేసింది.

మరో వైపు చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ ఇంకా సుప్రీం కోర్టులో పెండింగ్‌లోనే ఉంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 17ఏ పై తీర్పు వచ్చిన తరువాత పైబర్ నెట్ కేసు విచారణ చేపడతామని, అంతవరకూ చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని గతంలో ధర్మాసనం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Jan 16 , 2024 | 01:05 PM