AP Govt: ధరల నియంత్రణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Oct 26 , 2024 | 02:30 PM
Andhrapradesh: ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై మంత్రుల కమిటీని సర్కార్ ఏర్పాటు చేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో మంత్రుల కమిటీ ఏర్పాటైంది. కమిటీలో సభ్యులుగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ ఎక్స్ఆఫీషియో కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్‌గా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది.
అమరావతి, అక్టోబర్ 26: ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై మంత్రుల కమిటీని సర్కార్ ఏర్పాటు చేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) నేతృత్వంలో మంత్రుల కమిటీ ఏర్పాటైంది. కమిటీలో సభ్యులుగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ ఎక్స్ఆఫీషియో కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్‌గా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకస్మికంగా ఎందుకు పెరుగుతున్నాయన్న అంశంపై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Jaggareddy: అవును.. వాళ్లను తిట్టాను.. తప్పేంటి
నిత్యావసరాలు, కూరగాయల ధరల తగ్గింపునకు చేపట్టాల్సిన చర్యలపైనా సిఫార్సులు చేయాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. ఉత్పత్తి, సప్లై, డిమాండ్ , ధరలకు సంబంధించిన అంశాలు, పంటల తీరు, ఎగుమతులు, దిగుమతులపై కూడా అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశించింది. వినియోగదారులకు అందుబాటు ధరల్లో నిత్యావసరాలు, కూరగాయలు లభించేలా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని తెలిపింది. ధరలు నియంత్రణలోకి తెచ్చేందుకు అవసరమైన యంత్రాంగం రూపకల్పనకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఈ అంశాలపై ఓ డేటా బేస్‌ను ఏర్పాటు చేయాలని ఆర్డర్స్ వేసింది. ధరలు పెరిగినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్‌ను అమలు చేసేలా శాశ్వత ప్రాతిపదికన ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేసేందుకు సూచనలు ఇవ్వాలని వెల్లడించింది.
TDP: టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ధరల పెరుగుదల , నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై అధికారుల కమిటీ ఇచ్చిన సిఫార్సులను అధ్యయనం చేయాలని సూచించింది. ఆహార పంటలు, నిత్యావసరాలకు సంబంధించి ఉత్పత్తి, సరఫరా, నిల్వలకు సంబంధించి దీర్ఘ, స్వల్పకాలిక ప్రణాళికల అమలుపైనా ప్రభుత్వం సిఫార్సులు కోరింది. ఉత్పత్తి, నిల్వల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఏడాది పొడవునా ధరల్ని నియంత్రణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయదారులు, మిల్లర్లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ , ఆహారధాన్యాలు, పప్పు దినుసులు, వంటనూనె డీలర్లు, ఎగుమతి, దిగుమతిదార్లతో సమావేశం కావాలని ఆదేశించింది. అధ్యయనం అనంతరం తదుపరి నిర్ణయం కోసం సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రుల కమిటీకి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి...
Viral Video: ఛీ.. ఛీ.. జెయింట్ వీల్‌ను కూడా వదలరా.. బహిరంగంగా యువతీయువకుల పాడు పనులు..
Lokesh: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాకు లోకేష్.. అపూర్వ స్వాగతం
Read Latest AP News And Telugu News