Share News

Rahul Gandhi: రాహుల్‌కు గడ్డం గీస్తూ.. బార్బర్ ఎలా వణికాడో చూడండి..

ABN , Publish Date - Oct 26 , 2024 | 12:05 PM

రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఓ సాదాసీదా సెలూన్ షాపులో ట్రిమ్మింగ్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా బార్బర్ అజిత్‌తో మాట్లాడి నిత్య జీవితంలో ఆయన ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ బార్బర్ షాపులో ట్రిమ్మింగ్ చేయించుకున్న వీడియోను..

Rahul Gandhi: రాహుల్‌కు గడ్డం గీస్తూ.. బార్బర్ ఎలా వణికాడో చూడండి..
Rahul Gandhi

ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే రాహుల్ గాంధీ ఢిల్లీలోని బార్బర్ షాపులో ప్రత్యక్షమయ్యారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల వేళ ఎంతో బిజీగా ఉండే రాహుల్.. ఢిల్లీలోని ఓ సాదాసీదా సెలూన్ షాపులో ట్రిమ్మింగ్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా బార్బర్ అజిత్‌తో మాట్లాడి నిత్య జీవితంలో ఆయన ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ బార్బర్ షాపులో ట్రిమ్మింగ్ చేయించుకున్న వీడియోను ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. బార్బర్ కష్టాలను చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడంటూ రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న ఆదాయంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వయం ఉపాధి పొందుతూ. ఆత్మగౌరవంతో బతకాలనుకునే వారి కలలు నెరవేరడం లేదని, ఇటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆదాయం పెరిగే మార్గం చూపాలని, వారి నైపుణ్యానికి తగిన ప్రతిఫలం దక్కాలని రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో కోరారు.


తరచుగా..

రాహుల్ గాంధీ తరచూ వివిధ రంగాలకు సంబంధించిన కార్మికులు, రోజువారీ కూలీలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుని, ఎక్స్‌లో పోస్టుచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇలాంటి దృశ్యాలు ఎన్నో కనిపించేవి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఓ బార్బర్ షాపును సందర్శించి, హెయిర్ కట్, ట్రిమ్మింగ్ చేయించుకున్నారు. ఆ సందర్భంగా బార్బర్‌ను అడిగి పని నైపుణ్యానికి సంబంధించిన విషయాలను రాహుల్ తెలుసుకున్నారు.

ఎన్నికల నేపథ్యంలో..

ప్రస్తుతం జార్ఖండ్, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ దేశ రాజధానిలో బార్బర్ షాపును సందర్శించి అతడి సమస్యలను తెలుసుకుని రాహుల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయాన్ని తెలియజేయడానికే రాహుల్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 26 , 2024 | 12:18 PM