Lookout Notice: పేర్ని నాని భార్య జయసుధపై లుకౌట్ నోటీసు..
ABN , Publish Date - Dec 23 , 2024 | 09:38 AM
10 రోజులుగా పేర్ని నాని భార్య జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. కేసు దర్యాప్తుగా సహకరించాల్సిందిగా ఆదివారం పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. ఇంతవరకు పేర్ని నాని కుటుంబం స్పందించకపోవడంతో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అమరావతి: రేషన్ బియ్యం మాయం కేసు (Ration Rice Theft Case)లో వైఎస్సార్‌సీపీ (YSRCP) నేత, మాజీ మంత్రి పేర్నినాని కుటుంబం (Ex Minister Perni Nani Family) పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల నోటీసుల (Notices)పై పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు (Kittu) ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు పేర్ని నాని భార్య జయసుధ (Jayasudha)పై పోలీసులు (Police) లుకౌట్ నోటీసులు (Lookout Notice) జారీ చేశారు. ఆమె కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
10 రోజులుగా పేర్ని నాని భార్య జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. కేసు దర్యాప్తుగా సహకరించాల్సిందిగా ఆదివారం పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. ఇంతవరకు పేర్ని నాని కుటుంబం స్పందించకపోవడంతో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో నిందితులుగా పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజా కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా మానస కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడూ చట్టం గురించి నీతులు చెప్పే నాని.. ఇప్పుడు చట్టంలో ఆటలాడుతున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఏపీ(ap)లో రేషన్ బియ్యం అక్రమాల (PDS Ration Scam) గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లా బందరులో కోటి రూపాయల రేషన్ బియ్యం స్వాహా చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ విషయంలో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని చిక్కుల్లో పడ్డారు. రేషన్ బియ్యం మాయంపై పేర్నినాని సతీమణి జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజపై కూడా కేసు నమోదైంది. జగన్ ప్రభుత్వ హయాంలో నాని సతీమణి పేరిట గోడౌన్ నిర్మించి సివిల్ సప్లయిస్‌కు అద్దెకు ఇచ్చారు. ఆ క్రమంలోనే పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. దీంతో పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
మచిలీపట్నం గోదాంలో బియ్యం మాయం కేసులో పోలీస్, పౌరసరఫరాల శాఖల్లో కదలిక వచ్చింది. పది రోజులుగా అజ్ఞాతంలోకి మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ ఉంది. వారిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. గోడౌన్లు నాని భార్య జయసుధ పేరుతో ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అమ్ముకున్న పేర్ని నాని అవినీతి కారణంగా ఆయన భార్య జయసుధకు తిప్పలు తప్పడం లేదు. మచిలీపట్నం జిల్లా కోర్టు, ఏపీ హైకోర్టుల్లో ముందస్తు బెయిల్ కోసం పేర్నినాని పిటీషన్లు దాఖలు చేశారు. కోర్టు నిర్ణయం వెలువడే వరకు అజ్ఞాతంలోనే భార్యను పేర్ని నాని ఉంచారు. నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నప్పటికీ.. వారి ఆచూకీ కొనుగొనడంలో కృష్ణా పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. కొంతమంది అధికారులు, టీడీపీ నేతలు పేర్ని నానికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణాజిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన
పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News