Share News

Atchannaidu: తక్షణమే రైతులకు బిందు సేద్యం అందించండి...

ABN , Publish Date - Aug 02 , 2024 | 02:00 PM

Andhrapradesh: రాష్ట్ర రైతుల కోసం వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు తక్షణమే రాయితీపై బిందు సేద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో రాయితీపై బిందు సేద్యం అమలుపై అధికారులతో మంత్రి అచ్చెన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో తక్షణమే రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.

Atchannaidu: తక్షణమే రైతులకు బిందు సేద్యం అందించండి...
Minister Atchannaidu

అమరావతి, ఆగస్టు 2: రాష్ట్ర రైతుల కోసం వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు తక్షణమే రాయితీపై బిందు సేద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో రాయితీపై బిందు సేద్యం అమలుపై అధికారులతో మంత్రి అచ్చెన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో తక్షణమే రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రూ.1167 కోట్ల బకాయిలు పెట్టిందని తెలిపారు.

Vallabhaneni Vamshi: వల్లభనేని వంశీ అరెస్ట్‌‌కు రంగం సిద్ధం


జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో బిందు సేద్యం నిర్వీర్యమైందన్నారు. దేశంలో ముందున్న రాష్ట్రాన్ని దేశంలోనే చివరి స్థానంలోకి జగన్ ప్రభుత్వం తీసుకెళ్లిందని విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా అందించే బిందు సేద్యం ఫండ్ కూడా జగన్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదన్నారు. రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం తీవ్ర కక్ష పూరిత ధోరణి అవలంభించిందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం రైతులకు, రైతు శ్రేయస్సు కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Viral Video: మద్యం మత్తులో డ్రైవింగ్ సీటు దిగి మరీ.. ఇతడు చేసిన డేంజరస్ స్టంట్ చూస్తే..


మరోవైపు ఈరోజు సీఆర్డీయే అధారిటీ 36వ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మధ్యాహ్నం 3:30 గంటలకు సమావేశం ప్రారంభంకానుంది. ఎన్డీఏ కూటమి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం ఇది. అధారిటీ చైర్మన్‌గా ఉన్న సీఎం, వైస్ చైర్మన్ గా మున్సిపల్ శాఖ మంత్రి, సభ్యులుగా ఆర్థిక శాఖ మంత్రితో కలిపి మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. ఈ సమావేశంలో అమరావతి నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే సచివాలయంలో మహిళా శిశుసంక్షేమ శాఖ, విద్యుత్ శాఖ, ఎక్సైజ్ శాఖ, సివిల్ సప్లై శాఖలపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష చేయనున్నారు. సంబంధిత శాఖ మంత్రులు గమ్మిడి సంధ్యారాణి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఆయా సమీక్షలకు హాజరుకానున్నారు.


ఇవి కూడా చదవండి...

Tirumala: జూలైలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, హుండీ ఆదాయ వివరాలు ఇవీ...

Vallabhaneni Vamshi: వల్లభనేని వంశీ అరెస్ట్‌‌కు రంగం సిద్ధం

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 02 , 2024 | 02:00 PM