Narayana: రాజధానికి భూములు.. రంగంలోకి దిగిన నారాయణ.. సక్సెస్ అయ్యేనా
ABN , Publish Date - Nov 07 , 2024 | 01:47 PM
Andhrapradesh: అమరావతి ల్యాండ్ పూలింగ్ అనుమానాలను నివృత్తి చేసేందుకు మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. విజయవాడలోని రాజధాని రైతు అనుమోల్ గాంధీ నివాసానికి మంత్రి వెళ్లారు. ఇప్పటికే రాజధాని గ్రామాల్లో పలువురు రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పూలింగ్ అంగీకార పత్రాలను స్వీకరించారు.
విజయవాడ, నవంబర్ 7: విజయవాడలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) గురువారం పర్యటించారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ అనుమానాలను నివృత్తి చేసేందుకు ఆయన.. రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్తున్నారు. విజయవాడలోని రాజధాని రైతు అనుమోల్ గాంధీ నివాసానికి మంత్రి వెళ్లారు. ఇప్పటికే రాజధాని గ్రామాల్లో పలువురు రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పూలింగ్ అంగీకార పత్రాలను స్వీకరించారు.
CM Chandrababu: జగన్ సిగ్గుందా.. చంద్రబాబు మాస్ వార్నింగ్
అయితే.. ఇప్పటి వరకు భూములు ఇవ్వని రైతుల ఇళ్లకు వెళ్లిన మంత్రి.. ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి వివరాలను వెల్లడిస్తున్నారు. గతంలో పలు అనుమానాలు, భయాలతో పలువురు రైతులు రాజధాని అమరావతికి భూములు ఇవ్వలేదు. వారి వల్ల రాజధాని డిజైనింగ్, నిర్మాణాలకు కొంత మేర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో స్వయంగా మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. భూములు ఇవ్వకుండా భయంతో, అనుమానాలతో ఉన్న రైతుల ఇళ్లకు మంత్రి నారాయణ వెళ్లి అన్నదాతలను కలుస్తున్నారు. ల్యాండ్ పూలింగ్, రాజధాని నిర్మాణం ఆవశ్యకతను వివరిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న రాజధాని రైతు అనుమోల్ గాంధీ నివాసానికి మంత్రి వెళ్లి కలిశారు. రాజధాని అమరావతి ప్రాముఖ్యత, రాజధాని నిర్మాణం ఆవశ్యకతపై వివరించి.. రాజధానికి ఇవ్వాల్సిన భూములు ఇవ్వాలని వినతి చేశారు.
AP News: కడప కార్పొరేషన్ కౌన్సిల్ భేటీకి ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. తీవ్ర ఉద్రిక్తత
ఇక ఇప్పటికే రాజధాని గ్రామాల్లో ఇప్పటి వరకు భూములు ఇవ్వని రైతుల ఇళ్లకు వెళ్లి పలువురిని స్వయంగా కలిసి... రాజధానికి భూములు ఇచ్చి రాజధాని నిర్మాణానికి సహకరించాలని నారాయణ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లుగా తెలుస్తోంది. గత పదేళ్ల పాటు భూములిచ్చేందుకు నిరాకరించిన రైతులు ఇప్పుడు కాస్త మెత్తబడుతున్నట్లు సమాచారం. మంత్రి నారాయణ స్వయంగా ఇంటికెళ్లి.. భూముల విషయంలో ఆయన అడిగిన తీరుకు కొంతమంది రైతులు మెత్తబడి భూములు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి నారాయణ చేస్తున్న ఈ ప్రయత్నం పూర్తి స్థాయిలో సక్సెస్ అయితేనే రాజధాని నిర్మాణం వేగవంతం అవుతుంది. మరి మంత్రి నారాయణ చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి...
WhatsApp: వాట్సప్‌లో ఇలాంటి కంటెంట్ షేర్ చేస్తే చిక్కులు కొని తెచ్చుకున్నట్టే
Stock Market: రెండు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ సూచీలు..
Read Latest AP News And Telugu News