Share News

CM Chandrababu: విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించనున్న సీఎం

ABN , Publish Date - Nov 07 , 2024 | 12:16 PM

Andhrapradesh: రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం గ్రామంలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు తాళ్లాయపాలెంకు చేరుకున్నారు.

CM Chandrababu: విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించనున్న సీఎం
CM Chandrababu Naidu

అమరావతి, నవంబర్ 7: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) రాజధాని ప్రాంతంలో ఈరోజు (గురువారం) పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం గ్రామంలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు తాళ్లాయపాలెంకు చేరుకున్నారు. తాళ్లయపాలెలం గ్రామంలో నూతనంగా నిర్మించిన 400/220 కెవి గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రం మరికాసేపట్లో సీఎం చేతల మీదుగా మొదలుకానుంది.

ED: భూదాన్ భూమి అన్యాక్రాంతంపై కొనసాగుతున్న ఈడీ విచారణ


రాజధాని ప్రాంతం అభివృద్ధి కొరకు 400 కేవీ విద్యుత్ సరఫరా లైన్లు శాశ్వత మళ్లింపు పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేదుకు రూ.505 కోట్లతో నిర్మించిన జీఐఎస్ విద్యుత్ సబ్ స్టేషన్‌ను చంద్రబాబు స్టార్ట్ చేయనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5407 కోట్లతో నిర్మించిన సబ్ స్టేషన్లను కూడా వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు.

Telangana: గంట సేపు మూసీలో నిలబడాలి..కేసీఆర్, కేటీఆర్‌కు కాంగ్రెస్ సవాల్..


ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, చిత్తూరు, నంద్యాల, శ్రీ సత్య సాయి, శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్లు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభకానున్నాయి. సీఆర్డీయే పరిధిలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తాళ్ళాయాపాలెంలో 400 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను నిర్మించడం జరిగింది. ఆర్థిక అభివృద్ధి సాధించడంలో 24x7 గంటలు విద్యుత్ సరఫరా కీలక పాత్ర పోషించనుంది. మరోవైపు రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం క్రమక్రమంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగా రాజధాని ప్రాంతంలో తాళ్లాయపాలెంలో 400/220 కెవి గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రాన్ని సర్కార్ నిర్మించింది. ఈ కేంద్రాన్ని ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ తాళ్లాయపాలెంలో ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు రాజధాని ప్రాంతానికి 220/132/33కేవీ తాడికొండ కేంద్రం నుంచి కరెంట్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం నిర్మించిన 400/220 విద్యుత్ కేంద్రంతో పాటు నేలపాడులో 220/33 కేవీ విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. వీటి ద్వారా రాజధాని ప్రాంతంలోని అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అవుతుంది.


ఇవి కూడా చదవండి...

WhatsApp: వాట్సప్‌లో ఇలాంటి కంటెంట్ షేర్ చేస్తే చిక్కులు కొని తెచ్చుకున్నట్టే

Stock Market: రెండు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ సూచీలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 07 , 2024 | 12:58 PM