Narayana: బుడమేరు వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన
ABN , Publish Date - Sep 10 , 2024 | 01:13 PM
Andhrapradesh: బుడమేరు వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ మంగళవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సింగ్ నగర్‌లో వరద ముంపు తగ్గిందన్నారు. నాలుగైదు డివిజన్‌లలో లోతట్టు ప్రాంతాల్లో నీరు ఉందన్నారు. కండ్రిక వద్ద రోడ్డు సమాంతరంగా లేదని.. ఒక వైపు నీరు నిలవడంతో మోటార్లతో కాలువలకు మళ్లించామని చెప్పారు.
విజయవాడ, సెప్టెంబర్ 10: బుడమేరు వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ (Minister Narayana) మంగళవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సింగ్ నగర్‌లో వరద ముంపు తగ్గిందన్నారు. నాలుగైదు డివిజన్‌లలో లోతట్టు ప్రాంతాల్లో నీరు ఉందన్నారు. కండ్రిక వద్ద రోడ్డు సమాంతరంగా లేదని.. ఒక వైపు నీరు నిలవడంతో మోటార్లతో కాలువలకు మళ్లించామని చెప్పారు. రేపు (బుధవారం) సాయంత్రానికి ఎక్కడా వరద నీరు లేకుండా చేస్తామన్నారు. చంద్రబాబు సారధ్యంలో చేపట్టిన సహాయక చర్యలపై వరద బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన పథకంలో కీలక మార్పులు?
పాడైన వస్తువులు, వాహనాల విషయంలో కూడా ఇన్సూరెన్స్ కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడుతుందని తెలిపారు. వాహనాల మరమ్మత్తులకు యాభై శాతం ప్రభుత్వం భరిస్తుందన్నారు. పది వేల మంది కార్మికులు ముంపు ప్రాంతాల్లో క్లీనింగ్‌లో ఉన్నారన్నారు. మూడు రోజుల్లో విజయవాడ పూర్తిగా యధాస్థితికి వస్తుందన్నారు. నిన్నటి నుంచి ప్రారంభమైన సర్వే రేపటితో ముగుస్తుందన్నారు. చంద్రబాబు నివేదికను పరిశీలించి బాధితులకు సాయం అందిస్తారని మంత్రి నారాయణ వెల్లడించారు.
కాగా... పాయకపురంలో వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పొంగూరు నారాయణ సోమవారం పర్యటించారు. రైతు బజార్ రోడ్డులో వరద నీరు ఉన్న ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. శానిటేషన్‌లో భాగంగా డ్రైనేజీపై బ్లీచింగ్ చల్లారు. చాలా ప్రాంతాల్లో శానిటేషన్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. మళ్లీ తిరిగి వర్షం రావడంతో కొంత పనులకు అంతరాయం కలిగిందని,. డ్రైనేజ్ పనులపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు. నీరు నిల్వ ఉన్నప్పటికీ చెత్తను తొలగించకుంటే అంటు వ్యాధులు వస్తాయని, అందుకే నీటిలో ఉన్న చెత్తను తొలగిస్తున్నామని అన్నారు. వైద్యారోగ్య శాఖతో కలిసి హెల్త్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
iPhone 16: ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న హీరో సిద్ధార్థ దంపతులు.. టిమ్ కుక్‌తో ముచ్చట్లు
Donations: వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగుల భారీ విరాళం
Read LatestAP NewsAndTelugu News