Home » Budameru Rivulet
Budameru river issue: బుడమేరుపై మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో స్పష్టత నిచ్చారు. బుడమేరు సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటూ సభ్యుల అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
బుడమేరు ప్రాంతంలో ఆక్రమణలు తొలగించేందుకు త్వరలోనే కమిటీ వేస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆ ప్రాంతంలో ఉంటున్న పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా టిడ్కో ఇళ్లు ఇస్తామని మంత్రి చెప్పారు. పూర్తిస్థాయిలో ఆక్రమణలు తొలగించి మరోసారి ఉపద్రవం రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
Andhrapradesh: బుడమేరు ఆక్రమణలు తొలగింపుపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఆక్రమించుకుని ఉన్నవారికి తగు ప్రత్యామ్నాయం చూపించే తొలగిస్తామని తెలిపారు.
Andhrapradesh: బుడమేరు వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ మంగళవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సింగ్ నగర్‌లో వరద ముంపు తగ్గిందన్నారు. నాలుగైదు డివిజన్‌లలో లోతట్టు ప్రాంతాల్లో నీరు ఉందన్నారు. కండ్రిక వద్ద రోడ్డు సమాంతరంగా లేదని.. ఒక వైపు నీరు నిలవడంతో మోటార్లతో కాలువలకు మళ్లించామని చెప్పారు.
వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఏలేరు వరద పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు సోమవారం నాడు పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించిన పవన్.. గొల్లప్రోలులోని వైఎస్సార్ కాలనీ ముంపు పరిస్థితిని తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు...
ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో బుడమేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో విజయవాడ మహానగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బందనంలో చిక్కుకున్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
బంగాళాఖాతంలో మరోసారి ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇప్పటికే వర్షాలు, వరదలతో అల్లకల్లోలంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోసారి వరదలు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
బెజవాడ వాసులను బుడమేరు (Budameru) ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు..! విజయవాడ (Vijayawada) పట్ల బుడమేరు.. పగ.. మేరులా మారి పట్టి పీడిస్తోంది..! ఒకటా రెండా సుమారు పది రోజులుగా ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది..! హమ్మయ్యా.. వానలు, వరద తగ్గాయ్ అనుకునే లోపే మళ్లీ బుడమేరు భయపెడుతోంది..!
వరదల సమయంలో గండ్లు పూడ్చేందుకు ఏపీ జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన కృషి అందరినీ ఆకట్టుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
కూటమి సర్కార్.. అనుకున్నది సాధించింది. వరదలతో బెజవాడ ప్రజలను గజ గజ వణికించిన బుడమేరు పనులు విజయవంతంగా ముగిసాయి...