Share News

Vijayawada: విజయవాడలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన

ABN , Publish Date - Sep 14 , 2024 | 02:43 PM

Andhrapradesh: నగరంలోని కండ్రిక, బోస్ నగర్, జర్నలిస్టు కాలనీలో మంత్రి నారాయణ సుడి గాలి పర్యటన చేశారు. వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు శానిటేషన్ జరుగుతున్న చిన్న చిన్న రోడ్లపై స్వయంగా బైక్ నడుపుకుంటూ మంత్రి పర్యటించారు. నిన్నటి వరకు వరద నీరు ఉన్న ప్రాంతాల్లో శరవేగంగా వందలాది పారిశుధ్య కార్మికులతో క్లీనింగ్ పనులు జరుగుతున్నాయి.

Vijayawada: విజయవాడలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన
Minister Narayana

విజయవాడ, సెప్టెంబర్ 14: నగరంలోని కండ్రిక, బోస్ నగర్, జర్నలిస్టు కాలనీలో మంత్రి నారాయణ (Minister Narayana) సుడి గాలి పర్యటన చేశారు. వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు శానిటేషన్ జరుగుతున్న చిన్న చిన్న రోడ్లపై స్వయంగా బైక్ నడుపుకుంటూ మంత్రి పర్యటించారు. నిన్నటి వరకు వరద నీరు ఉన్న ప్రాంతాల్లో శరవేగంగా వందలాది పారిశుధ్య కార్మికులతో క్లీనింగ్ పనులు జరుగుతున్నాయి.

Excise Department: కన్న తల్లి దగ్గరకు వచ్చామనే ఆనందం ఉంది..


జర్నలిస్టు కాలనీలో నిల్వ అన్న వరద నీటిని భారీ మోటార్‌లతో బయటికి పంపింగ్ చేస్తున్న పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ... విజయవాడ సిటీలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందన్నారు. రేపటికల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు. వరద నీటితో ఇళ్లలో చాలా బురద ఉందని... అన్ని వీధుల్లో ఫైర్ ఇంజిన్‌లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నామని తెలిపారు. డ్రైన్‌లలో ఉన్న సిల్ట్ తొలగింపు కూడా వేగంగా జరుగుతోందన్నారు.

Telangana: రెచ్చిపోయిన కేటీఆర్.. సీఎం రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు..



వరద నీరు ఉన్న ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ కొన్నిచోట్ల జరగలేదని బాధితులు చెబుతున్నారని... అలాంటి చోట్ల మరోసారి ఎన్యుమరేషన్ చేయమని అధికారులను అదేశించామన్నారు. వరద నీరు బయటకి వెళ్లేందుకు నున్న రోడ్డు, బై పాస్ రోడ్డు,100 అడుగుల రోడ్డులో చాలా చోట్ల గండ్లు కొట్టామన్నారు. గండ్లు కొట్టిన చోట తాత్కాలికంగా పైప్ లైన్‌లు వేయాలని అధికారులకు సూచించామన్నారు. భవిష్యత్తులో రోడ్లపై నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా కల్వర్టులు నిర్మిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

Ganta Srinivas: దురుదృష్టకరంగా విజయసాయిరెడ్డి పరిస్థితి...

Excise Department: కన్న తల్లి దగ్గరకు వచ్చామనే ఆనందం ఉంది..

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 14 , 2024 | 02:45 PM