Share News

Minister Parthasarathy: రికార్డుస్థాయి పెన్షన్ల పంపిణీ కూటమి ప్రభుత్వ విజయం: మంత్రి పార్థసారథి

ABN , Publish Date - Jul 01 , 2024 | 09:36 PM

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో 12గంటల వ్యవధిలో రూ.4,170 కోట్లు పెన్షన్ల(Pension Distribution) రూపంలో పంపిణీ చేసి ఎన్డీయే ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని సమాచార శాఖ మంత్రి పార్థసారథి (Minister Parthasarathy) అన్నారు. ఇవాళ(సోమవారం) ఉదయం 6గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ 95శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసినట్లు వెల్లడించారు.

Minister Parthasarathy: రికార్డుస్థాయి పెన్షన్ల పంపిణీ కూటమి ప్రభుత్వ విజయం: మంత్రి పార్థసారథి
Minister Kolusu Parthasarathy

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో 12గంటల వ్యవధిలో రూ.4,170కోట్లు పెన్షన్ల(Pension Distribution) రూపంలో పంపిణీ చేసి ఎన్డీయే ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని సమాచార శాఖ మంత్రి పార్థసారథి(Minister Parthasarathy) అన్నారు. ఇవాళ(సోమవారం) ఉదయం 6గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ 95శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసినట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడూ ఇలా ఎవరూ చేయలేదని, ఇది చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయం అని మంత్రి చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో 2.65లక్షల మంది వాలంటీర్లు ఉన్నా ఈ స్థాయిలో ఎప్పుడూ ఇవ్వలేదని గుర్తు చేశారు. 1.30లక్షల మంది సచివాలయ సిబ్బందితో ఈ రికార్డు సాధించడం ఆనందంగా ఉందని మంత్రి పార్థసారథి సంతోషం వ్యక్తం చేశారు.


గత రెండు నెలలపాటు వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పెన్షన్ పంపిణీ ఆపేసిందని, వాలంటీర్లు లేకుండా పంపిణీ సాధ్యం కాదంటూ అడ్డగోలు నిబంధనలు పెట్టారని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే కొంతమంది వృద్ధులు చనిపోయారని దుయ్యబట్టారు. చంద్రబాబు చిత్తశుద్ధి, ఉద్యోగుల కష్టానికి నేడు సాధించిన రికార్డే నిదర్శనమని మంత్రి చెప్పుకొచ్చారు. సమర్థవంతమైన నాయకత్వం వల్లే ఈ ఘనత సాధించామని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడకి‌ వెళ్లినా పింఛనుదారులు ఆనందంతో పండగ చేసుకున్నారని మంత్రి చెప్పారు.

Pension Distribution: రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ..


సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్నికల హామీలో భాగంగా రూ.4వేలు పెన్షన్, బకాయి రూ.3వేలు కలిపి మెుత్తం ఏడు వేలు ఇచ్చారని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. 28కేటగిరీల్లో వేల కోట్ల రూపాయలు ఒక్కరోజులో పంపిణీ చేశామని, గత ప్రభుత్వం ఐదేళ్లకు రూ.వెయ్యి పెంచితే.. చంద్రబాబు 17రోజుల‌ పాలనలో రూ.4వేలకు పెంచారన్నారు. గతంలోనూ రూ.200నుంచి‌ రూ.2000లకు పెన్షన్ పెంచిన ఘనత చంద్రబాబుదే అని చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని ‌విధాలా దివాళా తీయించిందని, వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని పార్థసారథి ధ్వజమెత్తారు.

AP News: సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్..


చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు నిబద్ధతతో పని చేశారని, వారి కష్టం వల్లనే రాత్రి 8గంటల వరకు పెన్షన్ల పంపిణీ 95శాతం పూర్తయ్యిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఘట్టమని, ముఖ్యమంత్రి పనితీరుకు ఇది నిదర్శనమని మంత్రి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో ఏపీని అన్నీ విధాలా గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తారని మంత్రి పార్థసారథి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

AP Govt: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ..

AP Politics: టీడీపీ ఆఫీసుకు వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు.. ఎందుకంటే?

MLA Ganta: ఇచ్చిన మాటకి కట్టుబడి రూ.4వేలు ఇస్తున్నాం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

Updated Date - Jul 01 , 2024 | 09:41 PM