Share News

Somireddy: జగన్‌ను అలా పిలవాలన్నా అసహ్యమేస్తోంది

ABN , Publish Date - Oct 24 , 2024 | 01:35 PM

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తల్లీ, చెల్లి విషయంలో జగన్ ప్రవర్తిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లీ చెల్లికి ఆస్తి ఇవ్వనంటూ కోర్టుకెళ్లటం జగన్ క్రూర మనస్తతత్వానికి నిదర్శనమన్నారు.

Somireddy: జగన్‌ను అలా పిలవాలన్నా అసహ్యమేస్తోంది
MLA Somireddy Chandramohan Reddy

అమరావతి, అక్టోబర్ 24: ఆస్తి కోసం తల్లీ - చెల్లిని బ్లాక్‌మెయిల్ చేసిన వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని (Former CM YS Jaganmohan reddy) మాజీ ముఖ్యమంత్రి అని పిలవాలన్నా అసహ్యం వేస్తోందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి ఎమ్మెల్యే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (MLA Somireddy Chandramohan reddy) వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తల్లీ చెల్లికి ఆస్తి ఇవ్వనంటూ కోర్టుకెళ్లటం జగన్ క్రూర మనస్తతత్వానికి నిదర్శనమన్నారు. జగన్ అనుభవిస్తున్న ఆస్తి ప్రజలదని తెలిపారు. సరస్వతీ పవర్‌కు కేటాయించిన ప్రభుత్వ భూమి 30 ఏళ్లు లీజును జగన్ పొడిగించుకున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆరేళ్ల వరకూ దాన్ని ప్రారంభించకపోవటం చట్ట విరుద్ధమని చెప్పారు.

High Court: విజయసాయిరెడ్డి కుమార్తె కేసు.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారా.. హైకోర్టు ఆరా..


ప్రజల సొమ్మును వీళ్లకు ఎందుకు దారాదత్తం చేయాలని ప్రశ్నించారు. భూ కేటాయింపులను ఎందుకు ప్రభుత్వం రద్దు చేయకూడదని అడిగారు. నిబంధనలకు విరుద్ధంగా సరస్వతి పవర్ యాజమాన్యం వ్యవహరించినందున భూ కేటాయింపులు రద్దు చేయాలని తమ నాయకుడిని కోరుతున్నామన్నారు. జగన్ ఒప్పుకుంటే సరస్వతీ పవర్ 1500 ఎకరాలను మూడు భాగాలు చేసి ఒక భాగం రైతులకిచ్చి, మిగిలిన రెండు భాగాలను జగన్, షర్మిలకు (APCC Chief YS Sharmila Reddy) సమానంగా పంచుతామని తెలిపారు. తండ్రిని ఈడీ కేసులో ఇరికించి, ఆస్తి కోసం తల్లీ - చెల్లిపై కేసుపెట్టడం ఎక్కడా చూడలేదన్నారు. అలాంటి జగన్ నోట తల్లీ, చెల్లీ అనే మాటలు వినలేకపోతున్నామన్నారు.

Big Breaking: జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చేసింది..


ప్రజల ఆస్తులు కూడగట్టుకున్న జాబితాలో జగన్ ది దేశంలో రెండవ స్థానమంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌తో జగన్ జరుపుతున్న మంతనాలు ఇప్పటికే బయటకు తెలిశాయన్నారు. దీనిపై కేంద్రం ఎక్కడ కన్నెర్ర చేస్తుందోననే భయంతో చెల్లికి రాసిన లేఖలు బయటకు వదిలడం. జగన్ ఆడే నాటకం కావొచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఏ తల్లైనా తన పిల్లలందరినీ సమానంగా చూసుకుంటుందని తెలిపారు. కానీ జగన్ క్రూరత్వం గ్రహించిన విజయమ్మ చెల్లితోనే ఉండాల్సివస్తోందన్నారు. జగన్ క్రూరత్వాన్ని ఓ దర్శకుడు సినిమా సన్నివేశం తీశాడంటూ ఓ వీడియోను మీడియా సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రదర్శించారు.

Minister: కార్తీక దీపోత్సవానికి 40 లక్షల మంది భక్తులు


జగన్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సిందే: డొక్కా

dokka-manikyavaraprasd.jpg

గుంటూరు: నైతిక విలువలు లేకుండా సొంత తల్లి, చెల్లిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కోర్టుకు ఎక్కడం సిగ్గుచేటని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ (Former Minister Dokka Manikya Varaprasad) అన్నారు. తల్లి , చెల్లిని ఇబ్బందులు పెట్టడం చూస్తే జగన్ రెడ్డి చరిత్ర హీనుడుగా నిలుస్తారన్నారు. ‘‘గతంలో మీ ఆస్తులు ఎంత ఇప్పుడు మీ ఆస్తులు విలువ ఎంతో జగన్ రెడ్డి ప్రకటించాలి’’ అని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ఆస్తులపై పార్లమెంట్ సమావేశాలలో చర్చలు జరపాలన్నారు. జగన్ రెడ్డి బరితెగింపు చూస్తే ఆయన వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని అనుమానం కలుగుతోందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కూడా జగన్ రెడ్డి అక్రమ సంపాదనపై విచారణ చేయించాలన్నారు. జగన్ రెడ్డి ఆస్తులను కేంద్రం స్వాధీనం చేసుకొని జాతీయీకరణ చేయాలన్నారు. ప్రజల ఆస్తులను అప్పనంగా దోచుకున్న జగన్ రెడ్డి ఆస్తులపై కూటమి ప్రభుత్వం విచారణ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి జగన్ రెడ్డి ఆస్తులను ప్రభుత్వానికి చేరేలా చూడాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Diwali: దీపావళి ఎఫెక్ట్.. సొంతూళ్లకు లక్షలాది మంది ప్రయాణం

AP Highcourt: నందిగం సురేష్ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2024 | 01:47 PM