MP Kalishetti: టీటీడీ కళ్యాణ మండపాలపై చంద్రబాబుకు ఎంపీ కలిశెట్టి వినతులు
ABN , Publish Date - Oct 08 , 2024 | 01:18 PM
Andhrapradesh: ఇతరుల చేతుల్లో ఉన్న కళ్యాణ మండపాలను వెంటనే టీటీడీ స్వాధీనం చేసుకుని వాటిలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఢిల్లీ , చెన్నై, హైదారాబాద్, బెంగళూరు, విశాఖపట్నం లాంటి నగరాలలో, దేశవ్యాప్తంగా టీటీడీ ఆధీనంలో వున్న దేవాలయాలకు పాలకమండళ్ళు ఏర్పాటు చేయాలని వినతి చేశారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ‘‘టీటీడీ కళ్యాణ మండపాలను ధార్మిక కేంద్రాలుగా మార్చండి. దేశవ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాలకు పాలకమండళ్ళు ఏర్పాటు చేయండి. అమరావతి రాజధానిలో ఎమ్మల్యే, ఎమ్మెల్సీలతో పాటుగా ఎంపీలకు కూడా వసతి సౌకర్యాలు కల్పించండి. జర్నలిస్టులకు రైల్వే పాసులను పునరుద్ధరించి టోల్ గేట్ ల వద్ద ఫ్రీ పాస్ లను అందించండి’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు (CM Chandrababu Naidu) ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (MP Kalisetti Appala Naidu) వినతి చేశారు.
AP Wine Shop Tenders 2024: వైసీపీ నేతల నయా స్కెచ్..!
ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఎంపీ ఈ మేరకు వినతి పత్రాలను సమర్పించారు. ఇతరుల చేతుల్లో ఉన్న కళ్యాణ మండపాలను వెంటనే టీటీడీ స్వాధీనం చేసుకుని వాటిలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఢిల్లీ , చెన్నై, హైదారాబాద్, బెంగళూరు, విశాఖపట్నం లాంటి నగరాలలో, దేశవ్యాప్తంగా టీటీడీ ఆధీనంలో వున్న దేవాలయాలకు పాలకమండళ్ళు ఏర్పాటు చేయాలని వినతి చేశారు. భవిష్యత్తులో అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలకు కూడా వసతి సౌకర్యం కల్పించాలని కోరారు. జర్నలిస్టులకు రైల్వే పాసుల పునరుద్ధరణ, టోల్ గేట్‌ల వద్ద జర్నలిస్టులకు ఫ్రీపాస్ కల్పించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు.
NRI: ఈ నెల 19న వాషింగ్టన్ డీసీలో అట్లతద్ది వేడుకలు
చంద్రబాబు బిజీబిజీ..
కాగా.. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు పలువురు కేంద్రమంత్రులను సీఎం కలువనున్నారు. ఉదయం కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ అయ్యారు. సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం అవనున్నారు. అలాగే సాయంత్రం 5:45 గంటలకు కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అవుతారు. రాత్రి 8:00 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశంకానున్నారు. అనంతరం రాత్రి 11:15 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. నిన్నటి (సోమవారం) ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో తన నివాసంలోనే చంద్రబాబు సమావేశమైన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Bhanuprakash: ఆర్జీవీ.. జగన్‌పై అలా సినిమా తీస్తే బాగుంటుందేమో..
CM ChandrababuL రాజస్థాన్ సీఎంతో ఫోన్‌లో మాట్లాడిన ఏపీ సీఎం
Read Latest AP News And Telugu News