Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి లుక్ అవుట్ నోటీసులు..?
ABN , Publish Date - Aug 04 , 2024 | 01:07 PM
అమరావతి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లుక్ ఔట్ నోటీసులపై ఏపీ పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. దర్యాప్తులో ఉన్న కారణంగా వివరాలు వెల్లడించలేమని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ చెప్పారు. వంశీ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు.
అమరావతి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే (Ex MLA) వల్లభనేని వంశీకి (Vallabhaneni Vamsi) లుక్ ఔట్ నోటీసులపై (Look out Notice) ఏపీ పోలీసులు (AP Police) స్పష్టత ఇవ్వలేదు. దర్యాప్తులో ఉన్న కారణంగా వివరాలు వెల్లడించలేమని కృష్ణా జిల్లా (Krishna Dist.,) ఎస్పీ గంగాధర్ (SP Gangadhar) చెప్పారు. వంశీ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు. ఆయన ఆచూకీ కనుగొనేందుకు విశాఖపట్నం (Visakha), హైదరాబాద్ (Hyderabad), బళ్లారి, బెంగళూరుకు (Bangalore) పోలీస్ బృందాలు వెళ్లాయన్నారు. వంశీ దగ్గర బంధువులు, స్నేహితులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారన్నారు. కాగా టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఇప్పటికే 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు వంశీ స్వదేశంలో ఉన్నారా? లేదా విదేశాల్లో ఉన్నారా? అన్నదానిపై పోలీసు వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వల్లభనేని వంశీ ఏ71గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో చాలా మంది దాడికి ప్రోద్బలం ఇచ్చింది వల్లభనేని వంశీయేనని వాంగ్మూలం ఇచ్చినట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీంతో వంశీని ఈ కేసులో ఏ1గా మార్చాలని పోలీసులు భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియరాలేదు.
మరోవైపు వల్లభనేని వంశీ హైదరాబాద్‌లో లేరని, అమెరికా వెళ్లిపోయారంటూ కూడా ఇటీవల ప్రచారం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఆయన జాడ కోసం అన్వేషిస్తున్నారు. కాగా గత ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడిచేసి నిప్పుబెట్టారు. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగులబెట్టారు. అయితే వంశీ ప్రోద్బలంతో ఈ ఘటనలో గాయపడిన టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పవన్‌కల్యాణ్‌కు అభిమాని అరుదైన గిఫ్ట్..
సీఆర్డీయే ఆఫీస్‌లో కీలక ఫైళ్లు మాయం..
అండర్ గ్రౌండ్‌కు వెళ్లిన వైసీపీ నేతలు..
అప్పుడు తోడేశారు.. ఇప్పుడు తరలిస్తున్నారు..
నదుల అనుసంధానంపై కేంద్రం కీలక నిర్ణయం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News