RGV - CM Jagan: సీఎం జగన్‌తో ఆర్జీవీ రహస్య భేటీ.. కారణమిదేనా?!
ABN , Publish Date - Jan 17 , 2024 | 10:17 PM
అమరావతి, జనవరి 17: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో వ్యూహం సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రహస్యంగా భేటీ అయ్యారు. తాడేపల్లి వచ్చి సీఎం జగన్‌ను కలిశారు వర్మ. వీరి సమావేశంలో వ్యూహం సినిమా రిలీజ్‌కు ఎదురవుతున్న అడ్డుంకుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.
అమరావతి, జనవరి 17: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో వ్యూహం సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రహస్యంగా భేటీ అయ్యారు. తాడేపల్లి వచ్చి సీఎం జగన్‌ను కలిశారు వర్మ. వీరి సమావేశంలో వ్యూహం సినిమా రిలీజ్‌కు ఎదురవుతున్న అడ్డుంకుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. కాగా, బుధవారం ఉదయమే సీఎం జగన్‌ను ఆర్జీవీ కలిశారట. కానీ, వీరి భేటీని సీఎం క్యాంప్ ఆఫీస్ వర్గాలు అత్యంత గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. చివరకు మ్యాటర్ లీక్ అవడంతో హాట్ టాపిక్ గా మారింది.
కాగా, చాలా గ్యాప్ తరువాత వీరిద్దరి భేటీ చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఈ నెల 7వ తేదీన రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్.. ఏపీ పాలిటిక్స్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పట్లో ఓ ట్వీట్ చేసిన ఆర్జీవీ.. 'ఒకసారి వర్షం ఆగిపోతే.. అప్పటి వరకు ఉపయోగపడిన గొడుగు బరువుగా మారుతుంది. అలాగే ప్రయోజనాలు అందడం ఆగిపోతే.. విధేయత కూడా ముగుస్తుంది. ఇది రాజకీయాలకు సరిగ్గా సరిపోయే లైన్' అంటూ ఆర్జీవీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చూసిన వారు.. జగన్‌కు, ఆర్జీవీకి మధ్య ఏదో జరిగిందనే పెద్ద ఎత్తున జరిగింది. ఇన్ని రోజుల తరువాత మళ్లీ వీరిద్దరూ కలుసుకోవడం, అందులోనూ రహస్యంగా భేటీ అవడం హాట్ టాపిక్‌గా మారింది.
కాగా, ఆర్జీవీ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా విడుదలకు రాష్ట్ర హైకోర్టు బ్రేకులు వేసిన విషయం తెలిసిందే. సినిమాకు అన్ని విధాలుగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాంతో ఇప్పటికీ రిలీజ్ అవ్వకుండా నిలిచిపోతోంది. ఆ సినిమా వస్తుందనే నమ్మకం వారిలో కూడా లేదనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే.. సినిమా విడుదలపై ఏం చేద్దామా అని సీఎం జగన్, ఆర్జీవీ సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది.