Share News

PDS Ration Scam: పేర్ని నాని రేషన్ బియ్యం కుంభకోణంలో విస్తుబోయే విషయాలు

ABN , Publish Date - Dec 27 , 2024 | 08:38 AM

అరెస్టు కాకుండా ఉండేందుకు పేర్ని నాని కుటుంబం రాజకీయ పలుకుబడితో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 20 రోజులకుపైగా నాని భార్య జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది పోలీసులు, కూటమి నేతల సహకారం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.

PDS Ration Scam: పేర్ని నాని రేషన్ బియ్యం కుంభకోణంలో విస్తుబోయే విషయాలు

కృష్ణా జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader), మాజీ మంత్రి పేర్ని నాని (Ex Minister, Perni Nani) రేషన్ బియ్యం కుంభకోణంలో (Ration Rice Scam) తవ్వే కొద్దీ విస్తుబోయే విషయాలు (Shocking Facts) వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటి వరకు 3,708 బస్తాలు మాయం అయినట్లు ప్రకటన రాగా.. తాజాగా పూర్తి అయిన విచారణలో మొత్తం 7,577 రేషన్ బియ్యం బస్తాలు మాయం చేసినట్లు నిర్ధారణ అయింది. పేర్ని నాని కుటుంబ గోదాములో మాయమైన బియ్యం లెక్కలతో అధికారులు ఆశ్చర్య పోయారు. మొత్తం లెక్క తేల్చడానికి అధికారులకు నెల రోజుల సమయం పట్టింది.

కాగా అరెస్టు కాకుండా ఉండేందుకు పేర్ని నాని కుటుంబం రాజకీయ పలుకుబడితో విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 20 రోజులకుపైగా నాని భార్య జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది పోలీసులు, కూటమి నేతల సహకారం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని కుటుంబం పిటీషన్లు వేశారు. శుక్రవారం మచిలీపట్నం కోర్టులో విచారణ జరగనుంది.


లుక్ అవుట్ నోటీసు జారీ

మచిలీపట్నం గోదాంలో బియ్యం మాయం కేసులో పోలీస్, పౌరసరఫరాల శాఖల్లో కదలిక వచ్చింది. అజ్ఞాతంలో ఉన్న పేర్ని నాని కుటుంబపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. అయితే అజ్ఞాతం నుంచి పేర్ని నాని బయటకొచ్చారు. ఇంకా ఆయన సతీమణి జయసుధ అజ్ఞాతం వీడలేదు. గోడౌన్లు ఆమె పేరుతో ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అమ్ముకున్న పేర్ని నాని అవినీతి కారణంగా జయసుధకు తిప్పలు తప్పడం లేదు. మచిలీపట్నం జిల్లా కోర్టు, ఏపీ హైకోర్టుల్లో ముందస్తు బెయిల్ కోసం పేర్నినాని పిటీషన్లు దాఖలు చేశారు. కోర్టు నిర్ణయం వెలువడే వరకు పేర్ని నాని తన భార్యను అజ్ఞాతంలోనే ఉంచారు. నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నప్పటికీ.. వారి ఆచూకీ కొనుగొనడంలో కృష్ణా పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది.


మరోసారి నోటీసులు ఇస్తాం: ఎస్సీ

మాజీ మంత్రి పేర్ని నాని రేషన్‌ బియ్యం కేసు విచారణపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్‌ స్పందించారు. బియ్యం మాయం కేసులో వివరాలు ఉంటే ఇవ్వాలని పేర్ని నానికి నోటీసులు ఇచ్చామని స్పందించకపోవడంతో మరోసారి నోటీసులు ఇస్తామని వెల్లడించారు. రేషన్‌ బియ్యం మిస్సింగ్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు. విచారణ త్వరగా పూర్తి చేసి కేసును కొలిక్కి తెస్తామని స్పష్టం చేశారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని కుటుంబానికి చెందిన గిడ్డంగిలో రేషన్ బియ్యం మాయంపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గోదాములోని రేషన్ బియ్యాన్ని మచిలీపట్నంలోని మార్కెట్ యార్డుకు తరలించారు. వాటిని. పొట్లపాలెంలో పేర్ని నాని తన భార్య జయసుధ పేరుతో గోదాము నిర్మించి పౌరసరఫరాల శాఖకు లీజుకు ఇచ్చారు.


కాగా పేదల బియ్యాన్ని పందికొక్కులా బొక్కిన ఏ ఒక్కర్నీ వదలబోమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. నీతులు చెప్పే మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం కుంభకోణంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రూ. 90 లక్షల విలువైన బియ్యం మాయం చేసి పారిపోయారని విరుచుకుపడ్డారు. పోయిన బియ్యానికి డబ్బులు చెల్లిస్తామని తన దోపిడీని ఒప్పుకున్నారన్నారు. గత ఐదేళ్ల పాలనలో లక్షల టన్నుల బియ్యాన్ని వైసీపీ మాఫియా బొక్కేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ ఒక దొంగల పార్టీ... వాళ్ల నాయకుడో గజదొంగ అంటూ వ్యాఖ్యలు చేశారు. తండ్రి కొడుకులు బందరు యువతను గంజాయి మత్తులో నెట్టారన్నారు. అవినీతి కోసం ఇంట్లో మహిళల్ని కూడా రోడ్డుకీడ్చడం దుర్మార్గమన్నారు. బియ్యం కుంభకోణంలో పేర్ని నాని అడ్డంగా బుక్కయ్యాడని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

మన్మోహన్ సింగ్ మృతికి 7 రోజుల సంతాప దినాలు..

రవాణా.. అవినీతి జమానా

జగన్‌ నిర్ణయంతో బాధలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 27 , 2024 | 08:38 AM