KA Paul: సుప్రీంకోర్టులో కేఏపాల్‌కు చుక్కెదురు
ABN , Publish Date - Nov 08 , 2024 | 02:55 PM
Andhrapradesh: సుప్రీంకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్‌కు నిరాశే ఎదురైంది. తిరుమలను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలంటూ సుప్రీంలో పాల్ పిటిషన్ వేయగా.. ఈరోజు (శుక్రవారం) విచారణకు వచ్చింది. అయితే ఈ పిటిషన్‌కు సంబంధించి కేఏపాల్‌కు సుప్రీంలో చుక్కుదురైంది.
న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌కు (Prajashanti Party Chief KA Paul) సుప్రీంకోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. తిరుమలను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలంటూ సుప్రీంలో పాల్ పిటిషన్ వేశారు. ఈరోజు (శుక్రవారం) ఆయన వేసిన పిటిషన్ సుప్రీంలో విచారణకు వచ్చింది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తిరుమలను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న పాల్ పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఉన్నతన్యాయస్థానం వ్యాఖ్యానిస్తూ .. ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.
YSRCP: జగన్‍కు నటనలో ది బెస్ట్ అవార్డు ఇవ్వాలంటూ డిమాండ్..
సుప్రీం తీర్పుపై పాల్ స్పందిస్తూ.. ‘‘నా పిటిషన్ విచారించినందుకు కృతజ్ఞతలు’’ అని అన్నారు. తన పిటిషన్‌కు కేవలం 5 నిముషాల సమయం మాత్రమే ఇచ్చారన్నారు. కోట్లాది మంది హిందువులకు సంబంధించిన అంశానికి సమయం ఇవ్వలేదన్నారు. మతపరమైన స్వేచ్చకు తిరుమలలో విఘాతం కలుగుతోందన్నారు. హిందూ ఆలయాలను హిందు అర్చకులు, పూజారులే నిర్వహించుకోవాలని తెలిపారు. ముస్లింలు, క్రిస్టియన్‌లు వారి మసీదులు, చర్చిలను వారే నిర్వహించుకుంటున్నారని తెలిపారు. తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం చేసే అంశంపై మరోసారి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు చెప్పారు.
KTR: మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా..
లడ్డు కల్తీ వ్యవహారంపై దర్యాప్తునకు మూడు లేదా ఆరు నెలల కాలపరిమితి విధించేలా ఆదేశాలివ్వాలన్నారు. తిరుమలలో హిందు, క్రిస్టియన్ గొడవలు జరగకుండా ఉండాలంటే తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశారు. ఇటలీలో 746 మందికి వాటికన్ సిటీని ఒక దేశంగా మార్చారన్నారు. వాటికన్ సిటీలో పోప్ బిషప్స్ వాటికన్స్ కోరారు కాబట్టి దేశం ఇచ్చారని తెలిపారు. బద్రీనాథ్ ఇతర దేవాలయ ప్రాంతాలను ఎవరు కేంద్రపాలిత ప్రాంతం చేయమని అడగడం లేదని అన్నారు. తిరుమల వ్యవహారంపై పోరాటం కొనసాగుతుందని కేఏపాల్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
Harish Rao: మూసీ మురికికూపానికి కారణం మీరు కాదా..
Chennai: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రాకెట్ లాంఛర్ లభ్యం
Read Latest AP News And Telugu News