Share News

Skill Case: చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ వాయిదా

ABN , Publish Date - Nov 29 , 2024 | 02:01 PM

చంద్రబాబు స్కిల్ కేసు బెయిల్ రద్దుపై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ జనవరి నెలకు వాయిదా వేసింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టు తీర్పును గత జగన్ ప్రభుత్వ హయాంలో విచారణ చేస్తున్న ఏపీ సీఐడీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది.

Skill Case: చంద్రబాబు బెయిల్ రద్దుపై  సుప్రీంలో విచారణ వాయిదా

న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణ వాయిదా పడింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టు తీర్పును గత జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి వర్చువల్‌గా వాదనలు వినిపించారు. బెయిల్ రద్దును సవాలు చేస్తూ తాము దాఖలు చేసిన పిటీషన్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. తాను ఢిల్లీలో లేనని, విచారణకు స్వయంగా హాజరు కావాలనుకుంటున్నందువల్ల జనవరి వరకు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. దీంతో జనవరి రెండో వారానికి కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ బేలా ఎం త్రివేదీ ధర్మాసనం వెల్లడించింది.


కాగా స్కిల్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ (ED clean Chit) ఇచ్చింది. జగన్ ప్రభుత్వం హయాంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED ) విచారణ చేస్తోంది. అయితే ఈ కేసులో తాజాగా ఈడీ చేసిన ప్రకటన కీలకంగా మారింది. ఈడీ తాజా విచారణ తర్వాత సీఎం చంద్రబాబుకు ఈ అంశంలో ఎలాంటి ప్రమేయం లేదని రుజువైంది. ఈడీ విచారణ ప్రకారం నిధుల డైవర్షన్ విషయంలో చంద్రబాబు ప్రమేయం లేదని నిరూపణ అయింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై వైసీపీ నేతలు చేసిన అసత్య ప్రచారాన్ని ఈడీ వర్గాలు తప్పు పట్టాయి.

కాగా టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు గత సంవత్సరం స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 2014-19 చంద్రబాబు ప్రభుత్వం హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో స్కామ్ జరిగిందంటూ సీఐడీ పోలీసులు(CID Police) ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు నాయడు ఉన్నారు. ఆ తర్వాత హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదల అయ్యాయి.


అయితే ఈ కేసుకు సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్(Retired IAS officer PV Ramesh) ఓ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర జరిగిందని, అప్పటి సీఎంవోలోని పెద్దల ప్రమేయం ఉందన్నారు. అటు పోలీస్ శాఖలోనూ పలువురు సూత్రధారులు ఉన్నారని, కొందరు పదవుల్లో కొనసాగుతున్నారని చెప్పారు. అప్పట్లో తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వక్రీకరించారని, న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డీజీపీకి లేఖ రాశానని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్‌కు సంబంధించిన ఫైళ్లు మాయమయ్యాయని అప్పటి సీఐడీ అధికారులు చెప్పడం అత్యంత హాస్యాస్పదమన్నారు. ఫైళ్ల మాయమని చెప్పడంలోనూ పెద్ద కుట్ర దాగి ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎంత త్వరగా ఈ కేసును నిగ్గు తేల్చితే అంతమంచిదని పీవీ రమేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతి 2. Oకు రంగం సిద్ధం

వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

కొమురం భీం జిల్లా లో టైగర్ టెర్రర్.. మహిళ మృతి..

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 29 , 2024 | 02:02 PM