Buddha Venkanna: వైసీపీ అధినేత జగన్ వద్ద దొంగల ముఠా ఉంది: బుద్దా వెంకన్న
ABN , Publish Date - Dec 22 , 2024 | 06:33 PM
వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)పై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల బియ్యాన్ని నాని పందికొక్కులా తిన్నారని, ఆయన్ని వెంటనే ఊరి తీయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాని చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసే పనులు మాత్రం మరోలా ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani)పై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల బియ్యాన్ని నాని పందికొక్కులా తిన్నారని, ఆయన్ని వెంటనే ఊరి తీయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాని చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసే పనులు మాత్రం మరోలా ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి చిన్న విషయానికీ మీడియా ముందుకొచ్చి కూటమి నేతలపై ఆయన నోరు పారేసుకుంటున్నారని బుద్దా ధ్వజమెత్తారు. కులాల పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే ఆయన 187 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని అమ్మేసుకున్నారని బుద్దా ఆరోపించారు. పేర్ని నాని వంటి బియ్యం దొంగలను ప్రజలు క్షమించకూడదని మండిపడ్డారు.
లక్షల మెట్రిక్ టన్నులు స్వాహా..
ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. "ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేసి పేదల పొట్ట నింపేందుకు రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని 187 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని తినేశాడు. ఏ తప్పూ చేయకుండానే నాని రూ.1.70 కోట్లు కట్టారా?. దొరికిపోయిన దొంగ కాబట్టే డబ్బులు కట్టారు. కుటుంబంతో సహా పారిపోయే పరిస్థితికి పేర్ని నాని వచ్చారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ 6.5 లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం దారి మళ్లిందని పార్లమెంట్‌లో చెప్పారు. కరోనా సమయంలో అప్పటి సీఎం జగనే ఈ బియ్యాన్ని దారి మళ్లించి, ఆఫ్రికా వంటి దేశాలకు పంపారు. ఇందుకోసం కృష్ణపట్నం, ఇతర రేవులను జగన్ ఆక్రమించి.. పేర్ని నాని వంటి వారిని ఏజెంట్లుగా పెట్టుకున్నారు. పేదలు తినాల్సిన బియ్యాన్ని ఎగుమతి చేసి జగన్ రెడ్డి అడ్డంగా దోచుకున్నారు.
నాని ఆస్తులెంత?
ఈ దోపిడీలో సూత్రధారి పేర్ని నాని బాగోతం ఎన్డీయే ప్రభుత్వంలో బయటపడింది. నాని తన భార్య జయసుధ పేరుతో షెడ్‌లు పెట్టించి ఆమెనూ దోషిగా నిలబెట్టారు. తన కుమారుడు, భార్య ఎక్కడ ఉన్నారో నాని చెప్పాలి. 2019కి ముందు నాని ఆస్తులెంత, 2024 నాటికి ఆయన ఆస్తులెంతో చెప్పాలి. పేదలు తినే బియ్యం దోచుకున్న మీకు సిగ్గు, మానవత్వం ఉందా?. వైసీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే నీ దొంగతనం గుట్టు బయటకు వచ్చేది కాదు. దొంగతనం బయటపడిందే కాబట్టే పారిపోయావు. రూ.1.70 కోట్ల డీడీ ఎక్కడ నుంచి కట్టావు. ఆదాయపు పన్ను అధికారులు దీనిపై దృష్టిపెట్టాలి. పేదలకు ఇచ్చే బియ్యాన్ని దోచుకోవడానికి అసలు మీకు సిగ్గుందా?. పేర్ని నాని అనే వ్యక్తి సమాజంలో తిరగడానికి అనర్హుడు.
విచారణ చేయాల్సిందే..
ప్రత్యేక న్యాయస్థానం ద్వారా ఈ కేసు విచారణ త్వరగా జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏపీలో పేర్ని నాని, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోపిడీలు చేశారు. పోర్టులు, పొలాలు, బస్సులు అన్నీ ఇలానే లాక్కున్నారు. లక్షా 90 వేల మంది బాధితులకు చెందిన బియ్యాన్ని పక్కదారి పట్టించారు. పేర్ని నాని.. ఇప్పుడైనా లొంగిపో. పోలీసులు ఈడ్చుకెళ్లే వరకూ తెచ్చుకోకు. పేదల మీద కనికరం లేకుండా దోచుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వైసీపీ అధినేత జగన్ దగ్గర పెద్ద దొంగల ముఠానే ఉంది. ఆయన వారితో దోపిడీ చేయిస్తారు. అందుకే ప్రత్యేక న్యాయస్థానం పెట్టి వెంటనే శిక్ష పడేలా చూడాలని కోరుతున్నా. ఆరు నెలల్లో జగన్ కుటుంబాన్ని ప్రత్యేక న్యాయస్థానం ద్వారా విచారించి శిక్షించాలని" డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Vijayawada: అమిత్ షాపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది: యామిని శర్మ..
Kuppam: చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ధైర్యం చెప్పిందే వారే: నారా భువనేశ్వరి..