TDP: అర్ధరాత్రి గ్రూప్1 పరీక్షల ఫలితాలు విడుదల వెనుక ఆంతర్యమేంటి?
ABN , Publish Date - Apr 13 , 2024 | 02:22 PM
Andhrapradesh: గ్రూప్ 1 పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మార్చి 17వ తేదీన నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ఫలితాలను గత రాత్రి విడుదల చేశారు. అయితే రాత్రి పూట ఫలితాల విడుదలపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి అభ్యంతరం తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అర్థరాత్రి గ్రూప్స్1 పరీక్షల ఫలితాలు విడుదల చేయడం వెనుక ఆంత్యర్యం ఏంటి అని ప్రశ్నించారు. అలాగే ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం తగ్గడంపై కూడా టీడీపీ నేతల విరుచుకుపడ్డారు.
అమరావతి, ఏప్రిల్ 13: గ్రూప్స్ 1 పరీక్షల ఫలితాలను (Group 1 Exams Results) ఏపీపీఎస్సీ (APPSC) విడుదల చేసింది. మార్చి 17వ తేదీన నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ఫలితాలను గత రాత్రి విడుదల చేశారు. అయితే రాత్రి పూట ఫలితాల విడుదలపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి (TDP Leader Nadenla Brahmam Chawdary) అభ్యంతరం తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అర్థరాత్రి గ్రూప్స్1 పరీక్షల ఫలితాలు విడుదల చేయడం వెనుక ఆంత్యర్యం ఏంటి అని ప్రశ్నించారు. అలాగే ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం తగ్గడంపై కూడా టీడీపీ నేతల విరుచుకుపడ్డారు.
AP Politics: పురందేశ్వరి పేరుతో ఫేక్ ప్రకటన.. జగన్‌పై బీజేపీ నేత సీరియస్
కమీషన్ల కోసం విద్యార్థుల జీవితాలతో జగన్, బొత్స ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు. 62 శాతమే ఉత్తీర్ణత వచ్చిందని.. భారీగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారన్నారు. కళాశాలల్లో మౌళిక సదుపాయాలు, మధ్యాన్న భోజనం కరవని.. కళాశాలలకు గంజాయి, డ్రగ్స్, కొకైన్లు సరఫరా చేస్తున్నారన్నారు. జగన్ రెడ్డి మీటింగ్‌లకు విద్యార్థుల తరలించారన్నారు. ప్రభుత్వ కళాశాల్లో ఉత్తీర్ణత మరింత దారుణమన్నారు. విద్యార్థులు ఫెయిల్ అవ్వడానికి జగనే కారణమని ఆరోపించారుు. జగన్ చర్యలతో 7 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారన్నారు. నాడు కేంద్రం ఇచ్చిన ర్యాంకుల్లో టీడీపీ హయాంలో ఏపీ 3వ స్థానం ఉంటే.. నేడు 19వ స్థానంలో ఉందని విమర్శించారు. ఇంటర్ ఫలితాలపై సాక్షి టీవీ, సాక్షి పేపర్లలో మసిపూసి మారేడుకాయ చేసిందన్నారు. ట్యాబ్‌ల మీద, బైజూస్‌కు నిధులు ఇచ్చేందుకు జగన్‌కు శ్రద్ధ ఎందుకు అని నాదెండ్ల బ్రహ్మం చౌదరి ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే.. నేరుగా ఆమె వద్దకు వెళ్లి..
Bhuvaneswari: ముగిసిన భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ పర్యటన.. చివరగా ఎవరిని కలిశారంటే?
మరిన్ని ఏపీ వార్తల కోసం..