Share News

AP Politics: కొలిక్కివచ్చిన తిరువూరు పంచాయితీ..

ABN , Publish Date - Oct 05 , 2024 | 09:08 PM

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని, సీనియర్ నేతలు వర్ల రామయ్య, మంతెన సత్యనారాయణ రాజు తదితరులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును పిలిపించి మాట్లాడారు. తన పనితీరు కొందరికి ఇబ్బందులు కలిగిస్తాయని తాను ఊహించలేదన్నారు. తన కారణంగా తలెత్తిన..

AP Politics: కొలిక్కివచ్చిన తిరువూరు పంచాయితీ..
Kolikapudi Srinivasrao

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అంతర్గత విబేధాలు సమసిపోయినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారశైలిపై స్థానిక నేతలు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే తీరుపై అధిష్టానానికి వరసు ఫిర్యాదులు వెళ్లడంతో తిరువూరు పంచాయితీ ఎన్టీఆర్ భవన్‌కు చేరింది. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని, సీనియర్ నేతలు వర్ల రామయ్య, మంతెన సత్యనారాయణ రాజు తదితరులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును పిలిపించి మాట్లాడారు. తన పనితీరు కొందరికి ఇబ్బందులు కలిగిస్తాయని తాను ఊహించలేదన్నారు. తన కారణంగా తలెత్తిన ఇబ్బందులను సరిచేసుకుంటానని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హైకమాండ్‌కు తెలిపారు. ఇకనుంచి పార్టీ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానన్నారు. ఆదివారం తిరువూరులో విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం పెట్టాలని నేతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొననున్నారు. ఇటీవల తిరువూరులో చోటుచేసుకున్న పరిణామాలపై అధిష్టానం ఎమ్మెల్యే కొలికపూడి వివరణ కోరింది. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎంగా చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారని, చిన్నపాటి సమస్యల వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదన్నారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల మధ్య సమన్వయం కోసం అందరూ కలిసి ముందుకెళ్లాలన్నారు. తిరువూరులో జరిగే సమావేశంలో అన్ని విషయాలపై సమగ్రంగా చర్చిద్దామన్నారు. పార్టీ శ్రేణులను కలుపుకునిపోతూ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆదివారం నాటి సమావేశం జరగనుందన్నారు. ఏ పార్టీలో అయినా చిన్న చిన్న సమస్యలు సహజమని, కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు సమసిపోతాయన్నారు.

Tirupati: ఏబీఎన్ చొరవ.. క్యాన్సర్ రోగి చివరి కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు


సమన్వయ లోపంతోనే..

తన పనితీరు కారణంగా కేడర్‌తో సమన్వయలోపం ఏర్పడిందని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. తనకు విషయం ఆలస్యంగా అర్థమైందని, దీంతో చిన్నపాటి పార్టీ నాయకులకు, తనకు మధ్య చిన్నపాటి గ్యాప్ ఏర్పడిందన్నారు. తన కారణంగా ఏర్పడిన సమస్యలను సరిదిద్దుకోవల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సమన్వయలోపాన్ని సరిదిద్దుకుంటూ ఎంపీ కేశినేని చిన్న నేతృత్వంలో పనిచేస్తామని చెప్పారు. తిరువూరులో టీడీపీ బలోపేతమే లక్ష్యంగా నాయకులందరినీ కలుపుకుని ముందుకెళ్తామని తెలిపారు.

Mantena: ఏపీఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మంతెన


కుటుంబ సమస్య..

ఏ కుటుంబంలోనైనా చిన్నపాటి సమస్యలు తప్పవని తెలుగుదేశం పార్టీ కృష్ణా-గుంటూరు జిల్లాల సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు. తిరువూరు సమస్య కుటుంబ సమస్యవంటిదన్నారు. ఆదివారం జరిగే సమావేశంలో అన్ని సర్దుకుంటాయన్నారు. ప్రతిచోట చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయని, ఆ తర్వాత నాయకులంతా కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సర్ధుకుంటాయన్నారు.


Minister Narayana: బుడమేరు ఆక్రమణలతో విజయవాడ ముంపునకు గురైంది

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 05 , 2024 | 09:08 PM