Sharmila: టీడీపీ, వైసీపీవి నీచ రాజకీయాలు: వైఎస్ షర్మిలా రెడ్డి
ABN , Publish Date - Sep 19 , 2024 | 12:02 PM
అమరావతి: తిరుమలను అపవిత్రం చేస్తూ.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి వ్యాఖ్యానించారు. లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయన్నారు.
అమరావతి: తిరుమలను (Tirumala) అపవిత్రం చేస్తూ.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ (TDP), వైసీపీ (YCP)లు నీచ రాజకీయాలు (Dirty Politics) చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు (APCC Chief) వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila Reddy) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గురువారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు.
కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి మచ్చతెచ్చేలా ఉన్నాయని, చంద్రబాబు చేసిన ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే.. సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే లేకుంటే.. నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే... తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని షర్మిల డిమాండ్ చేశారు. లేదా సీబీఐతో (CBI) విచారణ జరిపించాలని అన్నారు. మహా పాపానికి, ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చాలన్నారు. సీఎం చంద్రబాబు తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని వైఎస్ షర్మిల చెప్పారు.
కాగా వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను భ్రష్టుపట్టించారంటూ సీఎం చంద్రబాబు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం నుంచి నిత్యాన్న ప్రసాదం వరకు అన్నింటినీ సర్వనాశనం చేశారని ఆరోపించారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉపయోగించి తయారు చేయాల్సిన శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వును కలిపారని అన్నారు. ‘‘తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా మార్చేశారు. ఎన్ని ఫిర్యాదుల చేసినా శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అయినా.. తిరుమలలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. చివరకు అన్న ప్రసాదంలోనూ నాణ్యత లేకుండా చేశారు. సాక్షాత్తూ స్వామి దగ్గర పెట్టే ప్రసాదం కూడా అపవిత్రం చేశారు. నాసిరకం సరుకులే కాకుండా, లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారు. ఈ రోజు స్వచ్ఛమైన నెయ్యి తెమ్మన్నాం. ప్రక్షాళన చేయమని చెప్పాం. ఇప్పుడు నాణ్యత పెరిగింది. ఇంకా నాణ్యత పెంచుతాం. వేంకటేశ్వరస్వామి మనరాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ఆయన కోసం ప్రపంచం మొత్తం మన దగ్గరకి వస్తోంది. అలాంటప్పడు తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.
కాగా యూఎస్ పర్యటనలో భాగంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన స్పందించిన తీరు పట్ల ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాహుల్ నిజాలు మాట్లాడితే.. తీవ్రవాదమంటారా? అంటూ ఆ రెండు పార్టీలను ఈ సందర్భంగా ఆమె నిలదీశారు. రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యముందా అని బీజేపీ, శివసేన నేతలను వైఎస్ షర్మిల ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్బంగా ఆమె గుర్తు చేశారు. అలాగే బీజేపీకి కొత్త అర్థం చెప్పారు. ఆ పార్టీ మతతత్వ పార్టీ అని ఆరోపించారు. ప్రజలను విడగొట్టి.. వారి మధ్య మంట పెట్టి అందులో చలి కాచుకుటుందని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన స్పందించిన తీరును అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బుధవారం విజయవాడలో వైఎస్ షర్మిల నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఆ పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
‘ఇది మంచి ప్రభుత్వం’ బ్రోచర్ ఆవిష్కరణ
ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక ఆన్‌లైన్ బుకింగ్..
కేటీఆర్‌పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News