AP NEWS; ఎన్టీఆర్ జిల్లాలో మహిళలను నిర్భదించిన అధికారులు.. కారణమిదే..!
ABN , Publish Date - Feb 17 , 2024 | 09:37 PM
‘‘వైఎస్సార్ ఆసరా’’ నాల్గోవిడత చెక్కుల పంపిణీలో అధికారులు, వైసీపీ నేతలు మహిళలను నిర్బందించి బలవంతంగా సభ నిర్వహించారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం మండల ఆఫీసులో జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా (ఇబ్రహీంపట్నం): ‘‘వైఎస్సార్ ఆసరా’’ నాల్గోవిడత చెక్కుల పంపిణీలో అధికారులు, వైసీపీ నేతలు మహిళలను నిర్బందించి బలవంతంగా సభ నిర్వహించారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం మండల ఆఫీసులో జరిగింది. గేట్లకు తాళాలు వేసి సమావేశం ఏర్పాటు చేయడంతో మహిళలు మండిపడ్డారు. బలవంతపు సమావేశంపై డ్వాక్రా మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభాప్రాంగణంలో కనీసం మంచినీరు కూడా ఏర్పాటు చేయలేదంటూ మండిపడ్డారు. బీపీలు, షుగర్ ఉన్నవాళ్లు కనీసం టీ , టిఫిన్ చేయటానికి కూడా వెళ్లనియకుండా గేట్లకు తాళాలు వేసి నిర్బంధిచటం మంచి పనికాదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మహిళలకు కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా బైటకు పంపడానికి వీలులేకుండా అధికారులు, వైసీపీ నేతల తీరు ఉందని మహిళలు మండిపడ్డారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి