Share News

Shivraj Singh: ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించిన చౌహాన్

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:09 PM

Andhrapradesh: వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు.

Shivraj Singh: ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించిన చౌహాన్
Union Minister Shivraj Singh Chouhan

అమరావతి, సెప్టెంబర్ 5: వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ( Union Minister Shivraj Singh Chouhan) గురువారం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) స్వాగతం పలికారు. అనంతరం ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్‌మెంట్ ఏరియాలను చౌహాన్ పరిశీలించారు.

Devineni Uma: సైకో ప్రభుత్వం వల్లే విజయవాడకు ముంపు



అక్కడ నుంచి వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్ నగర్‌లను ఏరియల్ సర్వే ద్వారా కేంద్ర మంత్రి పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి మంత్రి లోకేష్ వివరించారు. ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి నివాసంలోని హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వరద కారణంగా దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను కేంద్రమంత్రి చౌహాన్ పరిశీలించనున్నారు. అనంతరం జక్కంపూడి కాలనీ మిల్క్ ఫ్యాక్టర్టీ ప్రాంతాన్ని ఎన్.డీ.ఆర్.ఎఫ్ బోట్‌లో కేంద్ర మంత్రి, మంత్రి లోకేష్ పరిశీలించనున్నారు.

AP News: జోగి ఎక్కడ? హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల వేట..!


ఆపై విజయవాడ కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుకుని, వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను చౌహాన్ తిలకించనున్నారు. తరువాత వరద నష్టంపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో కేంద్రమంత్రి చౌహాన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించి, నివేదికలు అందజేయనున్నారు.


ఇవి కూడా చదవండి...

Telugu Desam: రాసలీలల ఎమ్మెల్యే.. టీడీపీ నుంచి సస్పెన్షన్

Devineni Uma: సైకో ప్రభుత్వం వల్లే విజయవాడకు ముంపు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 05 , 2024 | 04:09 PM