Anitha: పోలీసుల్లో పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకోవాలి: హోం మినిస్టర్ అనిత
ABN , Publish Date - Jun 19 , 2024 | 12:45 PM
అమరావతి: హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా బుధవారం వంగలపూడి అనిత బాధ్యతలు చేపట్టారు. సెక్రటేరియట్ రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణకు ముందు వంగలపూడి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాధ్యతలు చేపట్టిన హోంమంత్రికి రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.
అమరావతి: హోమ్, విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా వంగలపూడి అనిత (Vangalapudi Anita) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ (Secretariat) రెండవ బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో సంతకాలు చేసి బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతల స్వీకరణకు ముందు ఆమె ప్రత్యేక పూజలు (Special Pujas) నిర్వహించారు. కాగా బాధ్యతలు స్వకీరించిన హోంమంత్రికి రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా (DGP Harish Gupta) పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు దయ వల్ల, చంద్రబాబు (Chandrababu) ఆశీస్సులతో హోం మంత్రిగా (Home Minister) బాధ్యతలు చేపట్టానని అన్నారు. ఒక సామాన్య టీచర్ అయిన తనను హోం మంత్రిగా చేసిన పాయకరావు పేట ప్రజలందరికీ ధన్యవాదాలు అని అన్నారు. తనపై పెట్టిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆమె పునరుద్ఘాటించారు.
గత ఐదేళ్లలో లా అండ్ ఆర్డర్‌లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా శాంతిభద్రతల నిర్వహణ ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.
దిశా పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామమని మంత్రి అనిత చెప్పారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని, పోలీసుల్లో పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకోవాలని ఆమె సూచించారు. పోలీసులు ప్రజలకు అనుకూలంగా పని చేయాలని, ఖాకీ డ్రెస్‌కు గౌరవం వచ్చేలా పనిచేయాలని ఆమె హితబోధ చేశారు. సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బ తీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాలా వరకూ తగ్గిస్తామన్నారు. గత ప్రభుత్వంలో అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామని, అక్రమాలకు బలైన వారు కేసు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవినీతి చేసిన వారిని వదలం: మంత్రి పొన్నం
ఎన్డీఏ కూటమి విజయంతో అమెరికాలో ఎన్నారై సంబరాలు.
జగన్‌కు సచివాలయం నుంచి నోటీసు..
అప్పుడు జగన్ ఉపయోగించిన టెక్నిక్ ఇదే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News