Share News

Vijayasai Reddy: వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఇదేనా.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్లో అర్థం అదేనా

ABN , Publish Date - Sep 25 , 2024 | 07:07 PM

తిరుపతి లడ్డూ వివాదంపై దేశ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్న వేళ.. నిజాలు నిగ్గు తేల్చుందుకు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిజాయితీ గల అధికారులకు ఆ కమిటీలో చోటు కల్పించింది. దీంతో తమ తప్పులు ఎక్కడ బయటకు వస్తాయోననే ఆందోళనతోనే వైసీపీ నేతలు సిట్‪పై ఆరోపణలు..

Vijayasai Reddy: వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఇదేనా.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్లో అర్థం అదేనా
Vijayasai Reddy

తిరుమల లడ్డూ వివాదంపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంపై వైసీపీ నేతలు వరుస అసత్య ప్రచారాలు చేస్తున్నారు. సిట్ అంటే సీఎం చెప్పినట్లు వినే బృందమని ఆరోపిస్తున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందంపై తమకు నమ్మకం లేదంటూ ప్రకటనలు చేస్తున్నారు. వాస్తవానికి తిరుపతి లడ్డూ వివాదంపై దేశ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్న వేళ.. నిజాలు నిగ్గు తేల్చుందుకు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిజాయితీ గల అధికారులకు ఆ కమిటీలో చోటు కల్పించింది. దీంతో తమ తప్పులు ఎక్కడ బయటకు వస్తాయోననే ఆందోళనతోనే వైసీపీ నేతలు సిట్‪పై ఆరోపణలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.

తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన దర్యాప్తు బృందంపై తమకు నమ్మకం లేదన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో సిట్ ఎలా పనిచేసిందో అలాగే ఇప్పుడూ పనిచేస్తుందనే ఆలోచనతోనే వైసీపీ నేత విజయసాయి ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని.. కానీ ప్రస్తుతం ప్రభుత్వం మారిందనే విషయాన్ని ఆయన మర్చిపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలో ఏదైనా ఘటన జరిగినప్పుడు దానిపై సీబీఐ విచారణ కోరితే.. సిట్‪తోనే జగన్ సరిపెట్టేవారు. వైసీపీ ప్రభుత్వంలో సిట్ నివేదికలు బయటకు వచ్చేవి కావనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం వైసీపీ నేతల డైరెక్షన్, సీఎంవోలోని కొందరి ఆదేశాలతోనే అధికారులు పనిచేసేవారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో సిట్ పనిచేసిన విధంగానే ప్రస్తుతం పనిచేస్తుందనే ఆందోళనతోనే విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

AP Govt: వరద బాధితులకు ప్రభుత్వం అందించిన నష్ట పరిహార వివరాలు ఇవే


వైసీపీ హయాంలో..

వైసీపీ ప్రభుత్వం హయాంలో సిట్ దర్యాప్తు అంటే ఆ కేసు మరుగున పడినట్లేనన్న ఆరోపణలు ఎక్కువుగా వినిపించాయి. విపక్ష నేతలను ఏదైనా కేసులో అక్రమంగా ఇరికించాలంటే తమ మాట వినే అధికారులతో ఓ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేదనే విమర్శలు లేకపోలేదు. జత్వాని కేసులో వైసీపీ వ్యవహారించిన తీరును చూస్తే గత ప్రభుత్వంలో పోలీసులు, రాష్ట్ర దర్యాప్తు బృందాలు ఎలా పని చేశాయో అర్థం అవుతుంది. ఎలాంటి ఆధారాలు లేకపోయిన స్కిల్ డెవలప్‪మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరును రాష్ట్ర ప్రజలు గమనించారు. అధికారం ఉందనే అహంతో వైసీపీ చేసిన అరాచకాలను గమనించిన రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు. తమ ప్రభుత్వంలో పనిచేసినట్లు సిట్ ఉంటుందని విజయసాయిరెడ్డి ఊహించి ట్వీట్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయసాయి రెడ్డి ట్వీట్‪తో వైసీపీ బండారం బయటపడిందని, జగన్ ప్రభుత్వంలో వ్యవస్థలు ఎలా పనిచేసేవో విజయసాయి రెడ్డి పరోక్షంగా తెలియజేశారనే చర్చ జరుగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించబోయి విజయసాయి జగన్ రహస్యాలను చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.


AP Politics: వైసీపీకి మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 25 , 2024 | 07:24 PM