Share News

Vijayawada: విజయవాడలో ట్రాఫిక్ నరకం.. చేతులెత్తేసిన పోలీసులు..

ABN , Publish Date - Jan 19 , 2024 | 08:37 PM

Vijayawada Traffic Jam: నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో అక్కడి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. బందర్ రోడ్, వారధి రోడ్, ఏలూర్ రోడ్‌లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపుగా గంటన్నర నుంచి ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. వీఐపీ వాహనాలను పంపే హడావుడిలో పోలీసులు ఉన్నారు.

Vijayawada: విజయవాడలో ట్రాఫిక్ నరకం.. చేతులెత్తేసిన పోలీసులు..
Vijayawada Traffic Jam

విజయవాడ, జనవరి 19: నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో అక్కడి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. బందర్ రోడ్, వారధి రోడ్, ఏలూర్ రోడ్‌లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపుగా గంటన్నర నుంచి ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. వీఐపీ వాహనాలను పంపే హడావుడిలో పోలీసులు ఉన్నారు. విజయవాడలో ఇంతగా ట్రాఫిక్ అవడానికి కారణం సామాజిక న్యాయ సంకల్ప సభ. ఈ సభకు వచ్చిన వాహనాలతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్లు మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. వాహనదారులు అల్లాడుతున్నారు. సభకు వచ్చిన వాహనదారులు అడ్డదిడ్డంగా చేయడం.. పోలీసులు సైతం ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ సదుపాయం ఇవ్వడంతో విజయవాడ వాసులు నానా ఇక్కట్లు పడుతున్నారు.

ట్రాఫిక్ పద్మవ్యూహంలో బెజవాడ వాసులు..

భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా బెజవాడ వాసులు తమ ఇళ్లకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్‌లో ఎదురు చూస్తూ విలవిల్లాడుతున్నారు వాహనదారులు. ట్రాఫిక్‌ని నియంత్రించడంలో నగర పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వీఐపీల సేవలోనే తరిస్తున్నారని పోలీసులపై నిప్పులు చెరుగుతున్నారు. సామాన్యుల ఇక్కట్లను పోలీసులు గాలికొదిలేశారని మండిపడుతున్నారు వాహనదారులు. నగరంలో ఏ రహదారి చూసినా గంటల తరబడి రోడ్లపై కార్లు, బస్సులు నిలిచిపోయి కనిపిస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు సైతం కదలని పరిస్థితి నెలకొంది.

Updated Date - Jan 19 , 2024 | 08:44 PM