Share News

AP Highcourt: హైకోర్టులో సజ్జలకు ఊరట.. ఏ కేసులో అంటే

ABN , Publish Date - Oct 04 , 2024 | 03:59 PM

Andhrapradesh: ఈ నెల 25వ తేదీ వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఘటన జరిగిన రోజున సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారని.. ఈ కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఉందని పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు.

AP Highcourt: హైకోర్టులో సజ్జలకు ఊరట.. ఏ కేసులో అంటే
YSRCP Leader Sajjala Ramakrishna Reddy

అమరావతి, అక్టోబర్ 4: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి (YSRCP Leader Sajjala Ramakrishna Reddy) హైకోర్టులో (AP HighCourt) ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 25వ తేదీ వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఘటన జరిగిన రోజున సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారని.. ఈ కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఉందని పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు.

AP Capital: ఏపీ రాజధానికి రైల్వే ట్రాక్‌పై ఏపీ ఎంపీల కీలక ప్రకటన


ఆయన ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ్ లూథ్రా తెలిపారు. అయితే ఘటన జరిగిన రోజు సజ్జల 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని సజ్జల తరపున న్యాయవాదులు న్యాయస్థానానికి తెలియజేశారు. ఆ రోజున పోరుమామిళ్లల్లో ఉన్నారని, అక్కడ మీడియాలో వచ్చిన క్లిప్పింగ్‌లను కోర్టుకు చూపించారు. ఈ క్రమంలో తాము ఈ కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను మరోసారి పరిశీలిస్తామని సిద్దార్థ లూథ్రా చెప్పారు. దీంతో కేసు విచారణ హైకోర్టు ఈనెల 25కు వాయిదా వేసింది.


నందిగం సురేష్‌కు బెయిల్..

మరోవైపు ఇదే కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు హైకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. సురేష్‌కు షరతులతో కూడా బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి గత నెలలో నందిగం సురేష్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి కేసు నమోదు అయిన నేపథ్యంలో కొన్ని రోజులుగా మాజీ ఎంపీ కోసం వెతికిన పోలీసులు చివరకు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని గుంటూరు జిల్లాకు తరలించారు. అయితే ఈ కేసులో ముందుస్తు బెయిల్‌ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. కుదరదని కోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నందిగం సురేష్‌ను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి పోలీసులు వెళ్లగా.. ఆయన ఇంట్లో లేరని అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మాజీ ఎంపీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది.


అప్పటి నుంచి ఆయన కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు పక్కా సమాచారంతో హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు సురేశ్‌ను పోలీసులు రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. కీలక సమాచారాన్ని ఆయన నుంచి రాబట్టారు. రెండు వారాల జ్యుడీషియల్‌ రిమాండ్‌ ముగియడంతో మంగళగిరి కోర్టులో హాజరుపర్చగా మరో 14 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిన్న(గురువారం)తో రిమాండ్ ముగియడంతో మరోసారి సురేష్‌ను మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపర్చగా.. ఈనెల 17 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశించింది.


ఇవి కూడా చదవండి..

YV Subbareddy: కల్తీ జరగలేదు.. న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాం

AP Capital: ఏపీ రాజధానికి రైల్వే ట్రాక్‌పై ఏపీ ఎంపీల కీలక ప్రకటన

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 04 , 2024 | 04:34 PM