Share News

YS Jagan: జగన్‌ కేసులపై విచారణ మరోసారి వాయిదా

ABN , Publish Date - Aug 20 , 2024 | 03:52 PM

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ మరోసారి వాయిదా పడింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలన్న పిల్‌పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జగన్ కేసుల‌ప త్వరితగతిన విచారణ జరపాలని హరిరామ జోగయ్య పిల్‌ దాఖలు చేశారు.

YS Jagan: జగన్‌ కేసులపై విచారణ మరోసారి వాయిదా
YS Jagamohanreddy Cases

హైదరాబాద్/అమరావతి, ఆగస్టు 20: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) అక్రమాస్తుల కేసుల విచారణ మరోసారి వాయిదా పడింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలన్న పిల్‌పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జగన్ కేసుల‌ప త్వరితగతిన విచారణ జరపాలని హరిరామ జోగయ్య పిల్‌ దాఖలు చేశారు. ఇప్పటికే జగన్‌తో పాటు సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రజాప్రతినిధుల కేసులను త్వరితగతిన జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని పిటిషనర్‌ వాదించారు. ఈ క్రమంలో పిటిషన్లపై విచారణను సెప్టెంబర్‌ 17కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) వాయిదా వేసింది.

Lateral entry: లేటరల్ ఎంట్రీపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం..



మరోవైపు ఏపీ మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణ నుంచి జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ తప్పుకొంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. జగన్‌ అక్రమాస్తుల కేసులకు సంబంధించి నమోదైన సీబీఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పులు ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినా ఆ పద్థతినే అనుసరించాలని అప్పట్లో స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును గతేడాది మే నెలలో ఈడీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఆగస్టు 14న ఈడీ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Protests in Thane: స్కూల్లో ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక వేధింపులు


జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే.. కేసు ప్రారంభమైన వెంటనే తాను విచారణ నుంచి తప్పుకొంటున్నానని జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. వాదనలు వినిపించేందుకు ఇరుపక్షాల న్యాయవాదులు సిద్థమవగా జస్టిస్‌ సంజీవ్‌ కుమార్‌ లేని ధర్మాసనం ముందు పిటిషన్‌ను లిస్ట్‌ చేయనున్నట్టు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వెల్లడించారు. సెప్టెంబరు 2 నుంచి మొదలయ్యే వారంలో సీజేఐ ఆదేశాల మేరకు మరో ధర్మాసనం ముందు లిస్ట్‌ చేయాలని ఆయన ఆదేశించారు.


ఇవి కూడా చదవండి..

AP News: అనకాపల్లి ఫుడ్ పాయిజన్‌పై పాస్టర్ భార్య సమాధానం ఇదీ

TG Bharath: శ్రీవారిని దర్శించుకున్న మంత్రి టీజీ భరత్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 20 , 2024 | 03:58 PM