Share News

AP Politics: టచ్‌లోకి వైసీపీ నేతలు.. గేట్లు బంద్ అంటున్న టీడీపీ..!

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:25 PM

ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు వైసీపీ నాయకులు సైతం తమ ఓటమిపై రకరకాలుగా స్పందిస్తున్నారు.

AP Politics: టచ్‌లోకి వైసీపీ నేతలు.. గేట్లు బంద్ అంటున్న టీడీపీ..!
YSRCP Leaders

ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు వైసీపీ నాయకులు సైతం తమ ఓటమిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ వైఖరి కారణంగానే తాము ఓడిపోయామని కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. మరికొందరు నేతలు తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలతో కొందరు వైసీపీ నాయకులు టచ్‌లోకి వెళ్లగా.. వైసీపీ నాయకులను చేర్చుకునేందుకు టీడీపీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలకు తమ పార్టీలో గేట్లు మూచేశామని.. ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోబోమని చెబుతున్నారట. దీంతో ఏం చేయాలో తోచక వైసీపీ నాయకులు ఇతర పార్టీ నేతలతోనూ టచ్‌లోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోకుండా ఉండేందుకు జగన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వని జగన్.. ప్రస్తుతం పార్టీ జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలతో నేరుగా మాట్లాడుతున్నారట. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారవద్దని.. ప్రస్తుతం పార్టీలో ఉండే నాయకులకు భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. వైసీపీ నాయకులు మాత్రం తాము ఇదే పార్టీలో ఉంటే ఐదేళ్లు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమిలోని ఏ పార్టీలో చేరినా ఆర్థికంగా నష్టపోకుండా ఉంటామనే ఆలోచనలో వైసీపీ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

CM Chandrababu : టీడీపీ సారథిగా పల్లా శ్రీనివాసరావు


వాళ్లకు నో ఎంట్రీ..!

వైసీపీలో ఉంటూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఏ నాయకుడిని చేర్చుకునేది లేదని టీడీపీ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలు భారీ మెజార్టీ ఇవ్వడంతో ఈసారి ఫిరాయింపులు లేకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంపైనే దృష్టిసారించాలనే ఆలోచనలో టీడీపీ ఉందట. గతంలో నిబంధనలు పాటించకుండా.. అవినీతి, అక్రమాలకు పాల్పడిన నాయకులపై చట్టపరంగా చర్యలు తప్పవనే సంకేతాలను ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది. దీంతో కొందరు వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. కేసులు, చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకునేందుకు వైసీపీ వీడేందుకు సిద్ధమవుతుండగా.. కూటమిలోని పార్టీలు వారిని చేర్చుకునేందుకు ఇష్టపడటం లేదట. కనీసం కాంగ్రెస్ పార్టీలోనైనా చేరేందుకు మరికొందరు నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ కూటమి పార్టీలు వద్దంటే.. వైసీపీ నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటారు.. కష్టమైనా వైసీపీలోనే కొనసాగుతారా లేదా ఏ పార్టీలోకి వెళ్తారనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.


Macharla Police: పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్‌

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 17 , 2024 | 12:26 PM