Share News

Crime: సినీ పక్కీలో అఖిలప్రియ అనుచరుడిపై దాడి.. హత్యాయత్నం..

ABN , Publish Date - May 15 , 2024 | 12:54 PM

ఆల్లగడ్డలో ఉద్రిక్తత పరిస్థతి నెలకొంది. టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్‌పై ప్రత్యర్థులు దాడి, హత్యయత్నానికి ప్రయత్నించారు. సినీ పక్కీలో దాడి జరిగింది. మంగళవారం రాత్రి నిఖిల్ తన స్నేహితులతో కలిసి అఖిలప్రియ ఇంటి ముందు ఉన్నారు. ఈ క్రమంలో నిఖిల్‌ను టార్గెట్ చేసిన దుండగులు కారుతో వేగంగా వచ్చి ఢీ కొట్టారు.

Crime: సినీ పక్కీలో అఖిలప్రియ అనుచరుడిపై దాడి.. హత్యాయత్నం..

నంద్యాల జిల్లా: ఆల్లగడ్డలో ఉద్రిక్తత పరిస్థతి నెలకొంది. టీడీపీ (TDP) అభ్యర్థి భూమా అఖిలప్రియ (Bhuma Akhilapriya) అనుచరుడు నిఖిల్‌ (Nikhil)పై ప్రత్యర్థులు దాడి, హత్యయత్నానికి (Murder attempted) ప్రయత్నించారు. సినీ పక్కీలో దాడి జరిగింది. మంగళవారం రాత్రి నిఖిల్ తన స్నేహితులతో కలిసి అఖిలప్రియ ఇంటి ముందు ఉన్నారు. ఈ క్రమంలో నిఖిల్‌ను టార్గెట్ చేసిన దుండగులు కారు (Car)తో వేగంగా వచ్చి ఢీ (Collision) కొట్టారు. కిండ పడిన నిఖిల్‌పై కారులో వచ్చిన దుండగులు రాడ్‌లతో దాడికి యత్నించారు. దీంతో నిఖిల్ తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్లిపోయాడు. అక్కడున్నవారు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు కారులో పారిపోయారు.


రెక్కీ నిర్వహించి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నిఖిల్ తలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అఖిలప్రియ వెంటనే బయటకు వచ్చి దాడిపై ఆరా తీశారు.పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి సీసీ పుటేజ్‌ను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలప్రియ పోలీసులను డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎస్పీకి, ఆయన ఫ్యామిలీకి మేమే రక్షణ కల్పిస్తాం: సుధారెడ్డి

అవి కారు పార్టీ అభ్యర్థికి నష్టం కలిగించాయా?

ప్యాకప్ కట్టేసిన ఐప్యాక్ ప్రతినిధులు?

జగన్ ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు అప్పు..

ఏలూరులో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకుల దాడి

కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 15 , 2024 | 12:56 PM