AP News: నేను కేసులకు భయపడను.. జగన్‌కు బుడ్డా రాజశేఖర్ రెడ్డి వార్నింగ్
ABN , Publish Date - Aug 09 , 2024 | 05:32 PM
జగన్ పాలనలో ఎంతోమంది హత్యలు చేసి.. ఆయన పక్కన కూర్చున్న వారు చాలా మంది ఉన్నారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ( Buddha Rajasekhar Reddy) ఆరోపించారు. జగన్ తన కాల్ డేటా తీయాలని అంటున్నారని... తనతో పాటు తన అనుచరుల నంబర్లు కూడా ఇస్తానని సవాల్ విసిరారు. కాల్ డేటాను జగన్ బయటకు తీయించాలని అన్నారు.
నంద్యాల: జగన్ పాలనలో ఎంతోమంది హత్యలు చేసి.. ఆయన పక్కన కూర్చున్న వారు చాలా మంది ఉన్నారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ( Buddha Rajasekhar Reddy) ఆరోపించారు. జగన్ తన కాల్ డేటా తీయాలని అంటున్నారని... తనతో పాటు తన అనుచరుల నంబర్లు కూడా ఇస్తానని సవాల్ విసిరారు. కాల్ డేటాను జగన్ బయటకు తీయించాలని అన్నారు. తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. బండి ఆత్మకూరుకు చెందిన ఓ ముస్లిం మహిళను మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరులు అత్యాచారం చేస్తే జగన్ ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. తాను మాట్లాడిన వీడియోను మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని జగన్ అంటున్నారని.. ఆ పూర్తి వీడియో పంపిస్తాను. జగన్ ఆ వీడియో చూడాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు.
శిల్పా చక్రపాణి రెడ్డినే కారణం..?
సీతారామాపురంలో రెండు వర్గాల మధ్య శిల్పా చక్రపాణి రెడ్డినే గొడవ పెట్టారని.. సుబ్బరాయుడు హత్యకు కారకుడు కూడా శిల్పా చక్రపాణి రెడ్డినేనని ఆరోపించారు. తనపై కేసు పెట్టాలని జగన్ డిమాండ్ చేస్తున్నారని... కేసులకు భయపడే వ్యక్తిని తాను కాదని స్పష్టం చేశారు. తనపై కేసు నమోదైతే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరణ ఇచ్చుకుంటానని తెలిపారు. జగన్ నంద్యాలకు వచ్చారని.. వైసీపీ నాయకులు పరదాలు ఎందుకు కట్ట లేదని బుడ్డా రాజశేఖర్ రెడ్డి విమర్శించారు.
జగన్‌పై మంత్రుల ఆగ్రహం
మరోవైపు.. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌పై మంత్రులు, ఎమ్మెల్యేల ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. తాజాగా నంద్యాలలో ప్రెస్‌మీట్ పెట్టిన మంత్రులు బిసి జనార్ధన్ రెడ్డి, ఎన్‌ఎమ్‌డి ఫరూక్, ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ జగన్‌పై విరుచుకుపడ్డారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉన్నాయన్నారు. జగన్ పాలనలో 2,686 హత్యలు జరిగాయని, ఆయనపై కూడా కేసులు పెట్టాలని అన్నారు. ‘మీ కుటుంబ చరిత్ర అంతా రక్త చరిత్రే’ అని జగన్‌పై మంత్రి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
సీతారామాపురంలో రెండు కుటుంబాల మధ్య వివాదంతో జరిగిన మర్డర్‌ను రాజకీయం చేసి ఉనికి చాటుకోవడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ‘మీ బాబాయ్‌ని చంపితే ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశావో చెప్పాలి’ అని జగన్‌ను మంత్రి డిమాండ్ చేశారు. హత్యా రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న జగన్.. ముందుగా తన చెల్లెలు సునితా రెడ్డికి సమాధానం చెప్పాలన్నారు. హత్యలపై చర్చిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే చెప్పారని.. మరి జగన్ ఎందుకు స్పందించడం లేదని మంత్రి జనార్ధన్ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒకటో తేదీనే పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు.