Share News

CPI Narayana: ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని మోదీ ఇబ్బందులు పెడుతున్నారు..

ABN , Publish Date - Aug 18 , 2024 | 07:52 PM

దేశంలో బీజేపీ తనకు అనుకూలంగా లేని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) అన్నారు. తన మాట వినని రాష్ట్రాల సీఎంలను ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు.

CPI Narayana: ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని మోదీ ఇబ్బందులు పెడుతున్నారు..
CPI National Secretary Narayana

కర్నూలు: దేశంలో బీజేపీ తనకు అనుకూలంగా లేని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) అన్నారు. తన మాట వినని రాష్ట్రాల సీఎంలను ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రులను గవర్నర్ వ్యవస్థ ద్వారా ఇబ్బందులు పెడుతున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.


ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.." కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను అవినీతి కేసుల్లో ఇరికించాలని ప్రధాని మోదీ చూస్తున్నారు. భూమికి, మరో భూమి ఇస్తే తప్పెల్లా అవుతుంది. అమరావతి విషయంలో సీఎం చంద్రబాబు చేసింది ఇదే కదా. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చర్యలకు మోదీ పాల్పడుతున్నారు. కేరళ ప్రభుత్వాన్ని కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారు.


పశ్చిమ బెంగాల్‌లో డాక్టర్ అత్యాచారం దారుణమైన ఘటన. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఘటనకు బాధ్యత వహిస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలి. అత్యాచారానికి పాల్పడిన వారిని వెంటనే ఉరి తీయాలి. సెప్టెంబర్ 1నుంచి 7వరకు నిత్యావసరాల ధరలపై నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. పెద్దపెద్ద వాళ్లు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. వారిని రేవంత్ రెడ్డి ఉపేక్షించకూడదు" అని అన్నారు.

Updated Date - Aug 18 , 2024 | 07:52 PM