AP Politics: నంద్యాల జిల్లా వైసీపీలో మరోసారి భగ్గుమన్న వర్గవిభేదాలు
ABN , Publish Date - Feb 29 , 2024 | 08:59 PM
నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్(Nandikotkur MLA Arthur), శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి(Byreddy Siddharth Reddy) మధ్య తరచూగా గొడవలు జరుగుతుండటం తెలిసిందే. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేలా ఇద్దరు నేతలు ఎవరికి వారు నంద్యాల జిల్లాలో కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఇద్దరి కలిసి ఏదైనా సమావేశంలో పాల్గొన్నారంటే మాములు రచ్చ ఉండదు. వారిద్దరి అనుచరులు కొట్టుకున్నా సందర్భాలు అనేకం. ఇద్దరి నేతల గొడవలపై వైసీపీ(YSRCP) హై కమాండ్ సీరియస్‌గా కూడా తీసుకుంది.
నంద్యాల: నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్(Nandikotkur MLA Arthur), శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి(Byreddy Siddharth Reddy) మధ్య తరచూగా గొడవలు జరుగుతుండటం తెలిసిందే. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేలా ఇద్దరు నేతలు ఎవరికి వారు నంద్యాల జిల్లాలో కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఇద్దరి కలిసి ఏదైనా సమావేశంలో పాల్గొన్నారంటే మాములు రచ్చ ఉండదు. వారిద్దరి అనుచరులు కొట్టుకున్నా సందర్భాలు అనేకం. ఇద్దరి నేతల గొడవలపై వైసీపీ(YSRCP) హై కమాండ్ సీరియస్‌గా కూడా తీసుకుంది. అయితే కొన్ని రోజుల పాటు ఈ ఘర్షణలకు స్వస్తి పలికారు. కానీ ఇద్దరి నేతల అనుచరులు మాత్రం అడపా, దడపా దాడులకు తెగబడుతుండటం తెలిసిందే.
దాడిపై ఎస్పీకు ఫిర్యాదు
తాజాగా జిల్లాలోని పగిడ్యాల మండలం లక్ష్మాపురంలో వైసీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే ఆర్థర్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ మరోసారి రచ్చకెక్కింది. ఎమ్మెల్యే ఆర్థర్ నాయకత్వం వర్థిల్లాలని నినాదాలు చేశారని జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు రమణపై సిద్ధార్థ రెడ్డి వర్గీయులు దాడి చేశారు. పోలీసుల రంగ ప్రవేశంతో ఈ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. దేవాలయ ప్రతిష్ఠకు వెళ్లిన సందర్భంగా ఇరువర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగింది. సిద్ధార్థ రెడ్డి వర్గం రావడం లేదని, ఎమ్మెల్యే ఆర్థర్‌ను పోలీసులు తొలుత రమ్మని చెప్పారు. అయితే ఎమ్మెల్యే కార్యక్రమానికి వెళ్లాక ఆలయానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఆయన అనుచరులు ఒక్కసారిగా చేరుకున్నారు. ఆర్థర్ అనుచరుడు రమణ ఎమ్మెల్యేకు అనుకూలంగా నినాదాలు చేశాడు. ఇది నచ్చని సిద్ధార్థ రెడ్డి అనుచరులు ఆర్థర్ ముందే మూకుమ్మడిగా దాడి చేశారు. పోలీసుల తీరుపై, సిద్ధార్థ రెడ్డి వర్గంపై ఎమ్మెల్యే ఆర్థర్ నంద్యాల ఎస్పీకి ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఫొటోలు , వీడియోలు తీస్తున్న ఓ విలేకరి సెల్ ఫోన్‌ను సిద్ధార్థ రెడ్డి వర్గీయులు లాక్కుని దాడి చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి