AP NEWS: రాబోయే ఎన్నికల్లో ఆమెకు టికెట్ కష్టమే.. పృథ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 10 , 2024 | 03:28 PM
చెల్లి, తల్లికి న్యాయం చేయలేని సీఎం జగన్.. రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని జనసేన నేత, సినీనటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) అన్నారు.
నంద్యాల: చెల్లి, తల్లికి న్యాయం చేయలేని సీఎం జగన్.. రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని జనసేన నేత, సినీనటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) అన్నారు. శనివారం నాడు నంద్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో 136 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాలు జనసేన - టీడీపీ కూటమికి పక్కాగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు జైళ్లో ఉన్నపుడు పవన్ కళ్యాణ్ మద్దతిచ్చారని తెలిపారు.
ఏపీలో దుర్మార్గమైన పాలనను అంతం చేయడానికి తాము టీడీపీకి మద్దతిచ్చామని చెప్పారు. డైమండ్ రాణి రోజా గురించి మాట్లాడి వేస్ట్ అని.. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ ఆమెకు టికెట్ ఇవ్వరని అన్నారు. మంత్రి అంబటి రాంబాబు డిస్ట్రిబ్యూటర్‌గా పనికొస్తారని విమర్శించారు. పోలవరం గేట్ల గురించి కూడా తెలియని అంబటి ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడటం దౌర్భాగ్యమని పృథ్వీరాజ్ అన్నారు.