Nandyala: వేపచెట్టుపై కొండచిలువలు.. భయంతో పరుగులు తీసిన రైతులు..
ABN , Publish Date - Jan 13 , 2024 | 11:29 AM
నంద్యాల జిల్లా పాణ్యంలో కొండచిలువలు హల్ చల్ చేశాయి. స్థానిక స్టీల్ ప్లాంట్ వద్ద పంట పొలాలకు వెళ్తున్న రైతులు ఈ దృశ్యాన్ని చూసి
నంద్యాల జిల్లా పాణ్యంలో కొండచిలువలు హల్ చల్ చేశాయి. స్థానిక స్టీల్ ప్లాంట్ వద్ద పంట పొలాలకు వెళ్తున్న రైతులు ఈ దృశ్యాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. సుమారు 15 అడుగుల కొండ చిలువలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి వాటిని గుర్తించిన రైతులు వెంటనే స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు ఫారెస్ట్ అధికారులు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చంద్రహస్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా రెస్క్యూ టీం తారక్, ప్రవీణ్ లు కొండచిలువలు పట్టుకొని సురక్షితమైన కంచన్ బోన్ అటవీ ప్రాంతం లో విడిచిపెట్టారు. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ హాట్ టాపిక్ గా మారింది.