శ్రీశైలంలో వెండి రథోత్సవం
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:39 AM
శ్రీశైల క్షేత్రంలో సోమవారాన్ని పురస్క రించుకొని లోక కళ్యాణార్ధం మల్లికార్జున స్వామి, భ్రమ రాంబ అమ్మవార్లకు సాయంత్రం వెండి రథోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవను దేవస్థానం ఘనంగా నిర్వహిం చింది.
శ్రీశైలం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో సోమవారాన్ని పురస్క రించుకొని లోక కళ్యాణార్ధం మల్లికార్జున స్వామి, భ్రమ రాంబ అమ్మవార్లకు సాయంత్రం వెండి రథోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవను దేవస్థానం ఘనంగా నిర్వహించింది. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పూలతో ప్రత్యేకంగా అలంక రించి వేదికపై ఆశీనులు జేసి, అర్చకులు వేద మంత్రోచ్ఛర ణలతో పూజలు జరిపారు. అనంతరం సహస్ర దీపాలం కరణ సేవ నిర్వహించారు. తరువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెండి రథంపై అశీనులనుజేసి ప్రత్యేక పూజలు, మంగళ హార తులు ఇచ్చి ఆలయ ప్రాంగ ణంలో రథోత్సవాన్ని నిర్వహిం చారు. ఆలయ ఇన్‌చార్జి కార్యనిర్వహణాధికారి ఇ. చంద్రశేఖరరెడ్డి, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో సోమవారం మార్కాపురానికి చెందిన శ్వేత నాట్య అకాడమీ బృందంతో సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో గణేష్ ప్రార్థన, మహిషాసుర మర్దిని, శివ తాండవం, శంభో శివ శంభో, తాండవ నృత్యం, అఖిలాండేశ్వరి తదితర గీతాలకు కళాకారులు నృత్య ప్రదర్శనతో భక్తులను ఆకట్టుకున్నారు.