సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Dec 08 , 2024 | 12:19 AM
శ్రీశైలం మహాక్షేత్రంలో శనివారం మార్గశిర శుద్ధ షష్ఠిని పురస్కరించుకుని లోకకళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య (కుమార స్వామి)కి విశేష అభిషేకం, అర్చనలు, హోమం నిర్వహించారు.
శ్రీశైలం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మహాక్షేత్రంలో శనివారం మార్గశిర శుద్ధ షష్ఠిని పురస్కరించుకుని లోకకళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య (కుమార స్వామి)కి విశేష అభిషేకం, అర్చనలు, హోమం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో లోకక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పం పఠించారు. అనంతరం పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిస్వామికి పూజలు చేశారు. అనంతరం సుబ్రహ్మణ్యస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతో అభిషేకించి విశేష అలంకరణ, పూజాధికాలు నిర్వహించి మహా మంగళ హారతులు ఇచ్చారు.