శ్రీశైలంలో వైభవంగా ఊయల సేవ
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:35 AM
శ్రీశైల మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయల సేవను వైభవంగా నిర్వహించారు.
శ్రీశైలం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయల సేవను వైభవంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ముందుగా మహాగణపతి పూజను చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఊయలలో ఆశీనులనుజేసి శాస్ర్తోక్తంగా షోడశోపచార పూజలు జరిపారు. శ్రీశైల క్షేత్ర గ్రామదేవత అంకాలమ్మకు దేవస్థానం విశేష పూజలు నిర్వహించింది.
=