Nallamala: నల్లమలలో పెద్దపులి సంచారం.. రోడ్డు దాటుతూ ప్రత్యక్షం..
ABN , Publish Date - Jan 28 , 2024 | 12:03 PM
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది.
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. వరదరాజస్వామి ప్రాజెక్టుకు వెళ్లే దారిలో రోడ్డు దాటుతూ పెద్దపులి కనిపించింది. ఈ దృశ్యాలను గ్రామస్థులు సెల్ ఫోన్లలో వీడియో తీశారు. నెల రోజుల నుంచి గ్రామ పరిసరాల్లో, పంట పొలాల్లో పెద్దపులి తిరుగుతోందని గ్రామస్థులు తెలిపారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తోందన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. దేశంలోనే రెండో అతిపెద్దదైన టైగర్ రిజర్వు ప్రాజెక్టు నల్లమల అడవుల్లో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావడం విశేషం. ఈ అభయారణ్యంలో పెద్దపులే కాదు.. ఇతర జంతువులు సైతం అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. అరుదైపోతున్నాయన్న జాతులు కాడా కనిపిస్తుండటం కాస్త ఊరట కలిగించే విషయం. దీంతో జంతు ప్రేమికులే కాదు.. పర్యాటకులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాటి సంతతి అభివృద్ధి, రక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి