AP News: ‘నాన్న నువ్వే నా ధైర్యం.. నువ్వు నమ్మకపోతే ఎలా?’...కన్నీళ్లు పెట్టిస్తున్న లేఖ
ABN , Publish Date - Aug 06 , 2024 | 11:17 AM
Andhrapradesh: తండ్రీ కూతుళ్ల బంధ ఎంతటి గొప్పదో అందరికీ తెలిసిందే. కూతురిని మరో అమ్మగా భావిస్తుంటాడు తండ్రి. ఈరోజుల్లో కూతురికి తాను ఒక స్నేహితుడిగా మారి మంచి చెడులు చెబుతూ కూతురిని గొప్ప స్థాయికి తీసుకెళ్తేందుకు తన వంతు సాయం చేస్తాడు తండ్రి. కానీ నంద్యాలలో జరిగిన ఘటన చూస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆ కూతురికి తండ్రి అంటే ఎంతో ఇష్టం. తండ్రికి పరువే ప్రపంచం. కూతురు చదువులో టాపర్.
నంద్యాల, ఆగస్టు 6: తండ్రీ కూతుళ్ల బంధ ఎంతటి గొప్పదో అందరికీ తెలిసిందే. కూతురిని మరో అమ్మగా భావిస్తుంటాడు తండ్రి. ఈరోజుల్లో కూతురికి తాను ఒక స్నేహితుడిగా మారి మంచి చెడులు చెబుతూ కూతురిని గొప్ప స్థాయికి తీసుకెళ్తేందుకు తన వంతు సాయం చేస్తాడు తండ్రి. కానీ నంద్యాలలో జరిగిన ఘటన చూస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆ కూతురికి తండ్రి అంటే ఎంతో ఇష్టం. తండ్రికి పరువే ప్రపంచం. కూతురు చదువులో టాపర్. చదువులో టాప్‌లో ఉన్న ఆ యువతితో ఓ సీనియర్ స్నేహం పెంచుకున్నాడు. ఓ అన్నగా భావిస్తూ ఆమెకు తోడుగా నిలిచాడు. ఇదే ఇప్పుడు ఆమె పాలిట శాపంగా మారింది. తండ్రి ముందు దోషిగా నిలబడేలా చేసి.. చివరకు ప్రాణాలు తీసుకునేలా చేసింది. అన్నగా భావించిన సీనియర్.. యువతి తండ్రికి ఫోన్ చేయడంతో అనుమానంతో సదరు తండ్రి కూతురిని నిలదీశాడు. దీంతో తండ్రి మందలింపుతో మనస్థానికి గురైన యువతి బలవన్మరణానికి పాల్పడి నిండు జీవితాన్ని ముగించేసింది. యువతి చనిపోయే ముందు చివరగా తండ్రికి రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టేలా చేసింది. ఇప్పుడు యువతి లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
YSRCP: వైసీపీకి ఊహించని షాక్..
నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన జక్కి గౌరప్ప, రామేశ్వరి దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నాడు. పెద్ద కూతురు రేణుక ఎల్లమ్మ(22) మాచర్లలో బీటెక్ చదువుతోంది. బాలికల హాస్టల్‌లో ఉంటూ రేణుక చదవుతోంది. ఈ క్రమంలో తనకు సీనియర్ అయిన ఓ యువకుడితో యువతికి స్నేహం ఉంది. ఆ యువకుడు రేణుకను చెల్లిగా భావిస్తాడు. ఈ క్రమంలో యువతికి సీనియర్ ఫోన్ చేయగా.. ఆ సమయంలో రేణుక స్పందించలేదు. దీంతో కంగారు పడిన యువకుడు రేణుక తండ్రికి ఫోన్ చేసి యువతి గురించి ఆరా తీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి.. రేణుకను గట్టిగా మందలించాడు. కాలేజ్‌లో చదువుకునే అమ్మాయిలకు, అబ్బాయిలతో పని ఏంటి అంటూ మండిపడ్డాడు. రేణుక ఎంత నచ్చజెప్పినప్పటికీ తండ్రి వినకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో తాను ఏ తప్పు చేయలేదంటూ తండ్రికి లేఖ ద్వారా తెలియజేస్తూ తాను ఉండే రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని రేణుక ఆత్మహత్య చేసుకుంది. తర్వాతి రోజు తల్లిదండ్రులు వచ్చి చూడగా రేణుక శవమై కనిపించింది. ఈ ఘటన తోటి విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిచారు. అలాగే ఘటనాస్థలిలో రేణుక రాసిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Viral Video: వంటింట్లో భర్తకు షాక్ ఇచ్చిన భార్య.. ఇలాంటి టాలెంట్ ఈమెకు మాత్రమే సాధ్యమేమో..
లేఖలో ఏముదంటే?
కాగా.. రేణుక రాసిన లేఖ పలువురిని కంట తడి పెట్టించేలా చేసింది. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ‘‘నాన్న... నేను ఏ తప్పు చేయలేదు. నీ పరువు తీసే పని నేను చేయను. ఒక వేల అలా తప్పు చేస్తే ఆరోజే నా చివర రోజు . నేను తప్పు చేశాను అనుకుంటే నేను బ్రతకను. ఒక వేల నేను తప్పు చేశాను అనుకుంటే నువ్వు నా చదవు ఆపినా నేను బతకను నాన్న. నువ్వే నా ధైర్యం నాన్న.. నువ్వే నన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారు. నాన్న నేను తప్పు చేశాను అనుకుంటే నేను బ్రతకటం వ్యర్థం. అమ్మ నన్ను క్షమించు నేను చనిపోతున్నాను. నాన్న ఆ అన్న తప్పు ఏమీ లేదు. ఆ అన్న నన్ను అమ్మలా భావిస్తాడు. సారీ నాన్న....’’ అంటూ రేణుక రాసిన లేఖ అందరినీ కన్నీళ్లు పెట్టించింది.
ఇవి కూడా చదవండి..
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం.
Read Latest AP News And Telugu News