Lok Sabha Polls: తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి లోకేష్.. కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా..
ABN , Publish Date - Apr 10 , 2024 | 06:07 PM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రెండు రోజులపాటు తమిళనాడులో పర్యటించ నున్నారు. రేపు, ఎల్లుడిం ఆయన కొయ్యంబత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షులు అన్నామలై తరపున లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Lokesh) రెండు రోజులపాటు తమిళనాడులో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుడిం ఆయన కొయ్యంబత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షులు అన్నామలై (Annamalai) తరపున లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ సీటును ఎన్డీయే కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అన్నామలై తరపున దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు యువకులు, ఎన్డీయే పక్షాల నాయకులు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కొయ్యంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న తెలుగువారి ఓట్లను ఆకర్షించడమే లక్ష్యంగా లోకేష్ పర్యటన సాగనుంది. తెలుగువారు ఎక్కువుగా స్థిరపడిన ప్రాంతాల్లో లోకేష్ పర్యటిస్తారు.
TDP: నీకు ఓటు అడిగే అర్హత ఉందా?... జగన్‌పై కన్నా విసుర్లు
రేపు బహిరంగ సభ..
తమిళనాడులోని పీలమేడులో రేపు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలో లోకేష్ పాల్గొంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్ షో, ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న తర్వాత బహిరంగ సభలో లోకేష్ ప్రసంగిస్తారు. ఈ నియోజకవర్గంలో తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చి స్థిరపడిన ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో తెలుగు ప్రాంతాలకు చెందిన నాయకులతో ప్రచారం చేయించే వ్యూహంలో భాగంగా లోకేష్ తమిళనాడులో పర్యటించనున్నారు. గతంలోనూ తెలుగుదేశం పార్టీ నాయకులు తమిళనాడు ప్రాంతంలో ప్రచారం చేసిన సందర్భాలున్నాయి. తమిళనాడులో కూడా రెండంకెల ఓట్ల శాతం సాధించడమే లక్ష్యంగా ఎన్డీయే ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటోంది.
పారిశ్రామికవేత్తలతో సమావేశం..
తమిళనాడు పర్యటనలో భాగంగా 12వ తేదీన సింగనల్లూర్ ఇందిరా గార్డెన్స్‌లో తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేష్ సమావేశమవుతారు. అన్నామలై విజయానికి సహకరించాలని లోకేష్ పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు. మొదటి విడతలోనే తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. 17వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.
Kollu Ravindra: పీఎస్‌పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నానిపై కేసు పెట్టాల్సిందే..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..