YSRCP: టీడీపీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డ మల్లాది విష్ణు
ABN , Publish Date - Feb 08 , 2024 | 04:07 PM
Andhrapradesh: ఏపీ శాసనసభ సమావేశాలలో టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు అత్యంత హెయమైన చర్య అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ప్రతిరోజు కూడా పోడియం వద్దకి వెళ్లి స్పీకర్ మీద కాగితాలు చించి విసిరేస్తున్నారన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 8: ఏపీ శాసనసభ సమావేశాలలో టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు అత్యంత హెయమైన చర్య అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు (MLA Malladi Vishnu) వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ప్రతిరోజు కూడా పోడియం వద్దకు వెళ్లి స్పీకర్ మీద కాగితాలు చించి విసిరేస్తున్నారన్నారు. శాసనసభ అంటే వారికి లెక్క లేదన్నారు. ఒక ప్రజాప్రతినిధి అంటే ఆ ప్రాంత ప్రజల సమస్యల గురించి తెలియచేయాలన్నారు. కానీ టీడీపీ సభ్యులు ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా అవేమి పట్టించుకోకుండా గందరగోళం సృష్టిస్తారని మండిపడ్డారు.
ఆ దిశగా ముందుకు...
ఈ ఐదు సంవత్సరాలలో అనేక మార్పులు జరిగాయన్నారు. ఆరోగ్య వ్యవస్థలో కానీ విద్యా వ్యవస్థలో కానీ చాలా మార్పులు చేశారని చెప్పారు. జగన్ నాయకత్వంలో 2024 ఎన్నికల్లో 175 విజయ లక్ష్యం దిశగా ముందుకు వెళ్తామని చెప్పారు. 2024లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ప్రజలు శ్రీకారం చుడతారన్నారు. జనసేన, టీడీపీ 175 స్థానాలలో పోటీ చేసే దమ్ము లేక కలిసికట్టుగా వెళ్తున్నారన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు మళ్ళీ చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అధికార దాహం కోసం తహతహలాడుతున్న పార్టీ టీడీపీ పార్టీ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శలు గుప్పించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...