Share News

Konaseema: ద్రాక్షారామం ఈవోపై మంత్రి సుభాష్ సీరియస్.. దాతల శిలాఫలకంపై వేణు పేరేందుకని నిలదీత

ABN , Publish Date - Jun 26 , 2024 | 02:31 PM

ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్(Vasamsetti Subhash) బుధవారం కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో పర్యటించారు. అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆధ్యాత్మిక క్షేత్ర అధికారులతో మంత్రి మాట్లాడారు.

Konaseema: ద్రాక్షారామం ఈవోపై మంత్రి సుభాష్ సీరియస్.. దాతల శిలాఫలకంపై వేణు పేరేందుకని నిలదీత

కోనసీమ: ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్(Vasamsetti Subhash) బుధవారం కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో పర్యటించారు.

అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆధ్యాత్మిక క్షేత్ర అధికారులతో మంత్రి మాట్లాడారు. స్వామివారి రథం తయారీలోనూ అవినీతి జరగడంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాతల నిధులతో రథాన్ని తయారు చేస్తే.. శిలాఫలకంపై మాజీ మంత్రి, వైసీపీ నేత వేణు పేరు ఎలా వేశారని ఈవోను నిలదీశారు.


వేణు ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి దేవస్థానం నుంచే ఆహార పదార్థాలు సరఫరా చేయడమేంటని ఈవోను నిలదీశారు. వేణు.. వేల కోట్లు దండుకున్నారని సుభాష్ ఆరోపించారు. ఆలయంలో జరిగిన అవినీతి విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశామని, అధికారులు విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 26 , 2024 | 02:32 PM