AP News: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై వైసీపీ మూకల దాడి ఘటనపై నందమూరి బాలకృష్ణ స్పందన.. ఏమన్నారంటే..
ABN , Publish Date - Feb 19 , 2024 | 04:42 PM
ఆదివారం రాప్తాడులో వైసీపీ (YSRCP) నిర్వహించిన ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి (Andhrajyothy) ఫొటో గ్రాఫర్‌పై ఆ పార్టీ మూకలు చేసిన హేయమైన దాడి ఘటనను ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రంగాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఘటనను తప్పుపడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు స్పందించగా తాజాగా టీడీపీ (TDP) కీలక నేత, ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కూడా రియాక్ట్ అయ్యారు.
అమరావతి: ఆదివారం రాప్తాడులో వైసీపీ (YSRCP) నిర్వహించిన ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి (Andhrajyothy) ఫొటో గ్రాఫర్‌పై ఆ పార్టీ మూకలు చేసిన హేయమైన దాడి ఘటనను ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రంగాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఘటనను తప్పుపడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు స్పందించగా తాజాగా టీడీపీ (TDP) కీలక నేత, ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కూడా రియాక్ట్ అయ్యారు.
విధి నిర్వహణలో భాగంగా సమాచార సేకరణకు వెళ్లిన పాత్రికేయులపై వైకాపా నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. రాష్ట్రంలో పాత్రికేయులపై దాడులు పెరిగాయని, జర్నలిస్టులకు రక్షణ కరువైందని విచారం వ్యక్తం చేశారు. ‘‘ జర్నలిస్టుల రక్షణ కొరకు కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రశ్నించే గొంతు నొక్కాలనుకోవడం హర్షించదగిన విషయం కాదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజు మరెంతో దూరం లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. బాధిత విలేఖరికి నా సానుభూతి తెలియజేస్తున్నాను’’ అంటూ సోషల్ మీడియా వేదికగా నందమూరి బాలకృష్ణ స్పందించారు.
ఇవి కూడా చదవండి
Congress Vs BJP: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి ధర్మపురి అర్వింద్ సవాల్
AP News: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై దాడి వివరాలు వెల్లడించిన ఎస్పీ అన్బురాజన్