AP Elections: ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిదే విజయం.. తేల్చేసిన సర్వేలు
ABN , Publish Date - Mar 14 , 2024 | 10:12 PM
ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న తరుణంలో.. ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. కొన్ని వార్తా సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఈ సర్వేలు.. ఈసారి టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి (TDP BJP Janasena Alliance) ఘనవిజయం సాధిస్తుందని ఆ సర్వేలు తెలిపాయి. ఈ కూటమి ప్రభంజనం సృష్టించడం ఖాయమని వెల్లడించాయి.
ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న తరుణంలో.. ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. కొన్ని వార్తా సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఈ సర్వేలు.. ఈసారి టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి (TDP BJP Janasena Alliance) ఘనవిజయం సాధిస్తుందని తెలిపాయి. ఈ కూటమి ప్రభంజనం సృష్టించడం ఖాయమని వెల్లడించాయి. ఈ గణాంకాలపై తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) స్పందిస్తూ.. వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. ఇండియాటుడే, ఏబీపీ, న్యూస్ 18.. ఏ సర్వే గణాంకాలు చూసినా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే తిరుగులేని విజయమని తేల్చేస్తున్నాయని అన్నారు. సైకో జగన్ (YS Jagan) చేతిలో ధ్వంసమైన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని.. ఎన్డీఏ కూటమి (NDA) పునర్మిర్మాణం చేయగలదని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని, ఈ విషయాన్ని మీడియా సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ..
ఏపీలో NDA ప్రభంజనం
ABP-C ఓటర్ సర్వేలో వెల్లడి
ఏపీలో NDAకు 20 లోక్‌సభ స్థానాలు
ఐదు స్థానాలకే పరిమితం కానున్న YCP
కాంగ్రెస్‌దే హవా
తెలంగాణలో కొనసాగుతున్న కాంగ్రెస్ హవా
కాంగ్రెస్-10
బీజేపీ- 04
బీఆర్‌ఎస్-02
MIM- 01
ఏపీలో మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో టీడీపీ, జనసేన విజయం సాధిస్తాయని గతంలో ఇండియా టుడే (India Today) సర్వే వెల్లడించగా.. ఇప్పుడు తాజాగా మరో జాతీయ మీడియా సంస్థ ఏబీపీ (ABP) సర్వే ప్రకారం ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో 20 స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుస్తుందని తేలిందని నారా లోకేష్ పేర్కొన్నారు. మరో జాతీయ మీడియా సంస్థ న్యూస్ 18 ఒపీనియన్ పోల్ (News18 Opinion Poll) సర్వేలోనూ 18 స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుందని వెల్లడైందని తెలిపారు. సైకో జగన్ గ్యాంగ్ ఏ విషవ్యూహం పన్నినా.. దారుణ పరాజయం నుంచి వైసీపీ (YCP) తప్పించుకోలేదని సర్వేలు కుండబద్దలు కొట్టాయని దుయ్యబట్టారు. ప్రజావ్యతిరేక తుఫానులో వైసీపీకి అంతిమయాత్ర ఖాయమన్నారు. ‘‘హలో వై నాట్ 175 జగన్.. ఛలో లండన్’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీ జెండా పీకి.. శాశ్వతంగా గోతిలో పాతిపెట్టే సమయం ఆసన్నమైందని నారా లోకేష్ ఉద్ఘాటించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి