Narayana Swamy: నారాయణ స్వామికి టికెట్ ఇవ్వకుంటే మూకుమ్మడిగా రాజీనామాలు..!
ABN , Publish Date - Jan 18 , 2024 | 10:32 AM
నెల్లూరు జిల్లా గంగాధర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి నారాయణ స్వామి టికెట్ గల్లంతు అవుతుందని ప్రచారం జరుగుతుంది. నారాయణ స్వామికి టికెట్ ఇవ్వకుంటే వైసీపీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ఆయన అనుచరులు హెచ్చరించారు.
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లో సిట్టింగుల టికెట్లను వైసీపీ మారుస్తుంది. నెల్లూరు జిల్లా గంగాధర నుంచి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ సారి ఆయన టికెట్ గల్లంతు అవుతుందని ప్రచారం జరుగుతుంది. దీంతో నారాయణ స్వామి అనుచరులు సమావేశాలు నిర్వహించారు. నారాయణ స్వామికి టికెట్ ఇవ్వకుంటే వైసీపీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఆత్మహత్య చేసుకునేందుకు వెనకాడబోమని అల్టిమేటం ఇచ్చారు.
గంగాధరలో నారాయణ స్వామి వ్యతిరేక వర్గం తీరుపై మండిపడ్డారు. మాజీ ఎంపీ, ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహాదారుడు మహాసముద్ర జ్ఞానేంద్ర రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో జ్ఞానేంద్ర రెడ్డి పెత్తందారుడిలా వ్యవహరిస్తున్నారు. అతని నుంచి తమను కాపాడాలని పార్టీ అధినేత, సీఎం జగన్‌ను నారాయణ స్వామి అనుచరులు కోరారు. నెల్లూరు జిల్లా గంగాధర నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణ స్వామి గెలుపొందారు. నారాయణ స్వామి టికెట్ ఈ సారి మారుతుందనే ప్రచారం నేపథ్యంలో అనుచరులు వరసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.