Share News

AP News: ఓట్ల కోసం వైసీపీ నేతల భారీ కుట్ర

ABN , Publish Date - Feb 08 , 2024 | 10:35 AM

నెల్లూరు రూరల్‌లో ఓట్ల కోసం వైసీపీ భారీ కుట్రకు తెరదీసింది. నిన్నటి నుంచే ప్రభుత్వ సచివాలయాల్లో సిబ్బంది, వలంటీర్లతో వైసీపీ నేతలు, ఎమ్మెల్వోలు అనధికారిక సమావేశాలు నిర్వహిస్తున్నారు.

AP News: ఓట్ల కోసం వైసీపీ నేతల భారీ కుట్ర

నెల్లూరు: నెల్లూరు రూరల్‌లో ఓట్ల కోసం వైసీపీ భారీ కుట్రకు తెరదీసింది. నిన్నటి నుంచే ప్రభుత్వ సచివాలయాల్లో సిబ్బంది, వలంటీర్లతో వైసీపీ నేతలు, ఎమ్మెల్వోలు అనధికారిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూడు నెలల పాటు ఒక్కొక్కరికీ రూ.30వేలు ఇస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. వైసీపీకి ఓటు వేయకుంటే, పథకాలు రావంటూ ఓటర్లని బెదిరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.

రామలింగాపురంలో ఇదేమని ప్రశ్నించిన ఇద్దరు వలంటీర్లని విధుల నుంచి తొలగించడం జరిగింది. ఒక దళిత వలంటీరుపై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు. అనధికార సమావేశాలు, వలంటీర్ల తొలగింపుపై వైసీపీ నేతలను టీడీపీ నేత మదన్ కుమార్ రెడ్డి నిలదీశారు. దీంతో మదన్‌పై వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆయనను ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడారు. దీంతో ఆర్డీవోకి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఓట్ల కోసం వైసీపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు.

Updated Date - Feb 08 , 2024 | 10:35 AM